Movie News

1000 కోట్లకు తక్కువ కాకుండా బన్నీ అడుగులు

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా 1700 కోట్ల మార్క్ దాటి సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో చాలా పక్కాగా అడుగులు వేస్తున్నారు. సాధారణంగా టాలీవుడ్‌లో ఏ హీరోకైనా వెయ్యి కోట్ల మార్క్ అందుకోవాలంటే రాజమౌళి తోడు ఉండాలని అంతా అనుకుంటారు. కానీ బన్నీ మాత్రం జక్కన్న అవసరం లేకుండానే తన స్టార్ పవర్, సుక్కు మ్యాజిక్ తో ఆ మ్యాజిక్ ఫిగర్ ని టార్గెట్ చేస్తున్నారు.

బన్నీ తన లైనప్‌ను డిజైన్ చేసుకుంటున్న విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం హిట్స్ ఉన్న దర్శకులే కాకుండా, తన ఇమేజ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే సత్తా ఉన్న వాళ్లను ఆయన లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో AA22 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్ తో AA23 ఉండబోతోందని అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. ఇక సందీప్ రెడ్డి వంగాతో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ‘స్పిరిట్’ తర్వాత వంగా బన్నీ ప్రాజెక్ట్ పై ఒక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

అయితే బన్నీ లైనప్‌లో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పేరు ఆదిత్య ధర్. రీసెంట్ గా ‘ధురంధర్’ సినిమాతో బిగ్ హిట్ కొట్టిన ఆదిత్య, బన్నీ కోసం ఒక క్రేజీ సబ్జెక్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి జియో స్టూడియోస్ నిర్మాణంలో మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా ఒక మోడరన్ సూపర్ హీరో మూవీ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ‘కల్కి 2898 AD’ సినిమాలో కర్ణ, అశ్వత్థామ పాత్రల ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిపోయినట్లు సమాచారం. ఇప్పుడు ఆదిత్య ధర్ ఒక పూర్తి స్థాయి సరికొత్త కథతో బన్నీని కలిశారని, అది అశ్వత్థామ కాకుండా వేరే సబ్జెక్ట్ అని ఇన్ సైడ్ టాక్. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

బన్నీ స్వతహాగా స్క్రిప్ట్ వర్క్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు. కథలో ప్రతి పాయింట్ పక్కాగా అనిపిస్తేనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అందుకే ఆయన చేసే ప్రతి సినిమా ఇప్పుడు మినిమమ్ వెయ్యి కోట్ల బిజినెస్ తోనే మార్కెట్ లోకి అడుగుపెడుతోంది. అట్లీ, లోకేశ్, సందీప్ వంగా.. వీళ్లంతా బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టిన దర్శకులే. వీరితో బన్నీ చేసే సినిమాల్లో ఏ ఒక్కటి క్లిక్ అయినా లెక్క 1000 కోట్లను దాటే ఛాన్స్ కనిపిస్తోంది.

రాజమౌళి లేకుండానే ఒక హీరో తన సొంత స్టార్ పవర్ తో గ్లోబల్ మార్కెట్ ను శాసించడం అంటే అది చిన్న విషయం కాదు. బన్నీ తన పెర్ఫార్మెన్స్ తో పాటు దర్శకులను ఎంచుకునే విషయంలో చూపిస్తున్న మెచ్యూరిటీ ఇప్పుడు ఆయనను గ్లోబల్ స్టార్ గా నిలబెడుతోంది. పుష్ప 2 ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు రాబోయే ప్రతీ ప్రాజెక్ట్ పై నేషనల్ లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆదిత్య ధర్ తో చేసే సినిమా గనుక సెట్ అయితే బన్నీ లైనప్ ఇంకా స్ట్రాంగ్ గా మారుతుంది.

Kumar

Recent Posts

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

16 minutes ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

22 minutes ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

32 minutes ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

2 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

4 hours ago

చివరి గీతం… ‘గాన కోకిల’ జానకి ఇక లేరు

సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…

4 hours ago