Movie News

కన్ఫర్మ్… భగవంత్ కేసరే జన నాయకుడు

అనుకున్నంతా అయ్యింది. బాలయ్య భగవంత్ కేసరి రీమేకే విజయ్ జన నాయకుడనే ప్రచారానికి ఫైనల్ గా ట్రైలర్ రూపంలో అధికారిక ముద్ర పడింది. మూడు నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోలో  ఏదీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు చూపించారు. బాలకృష్ణ పాత్రలో విజయ్ ఎంట్రీ ఇవ్వగా, శ్రీలీల ప్లేస్ మమిత బైజు తీసుకుంది.

కాజల్ అగర్వాల్ బదులు పూజా హెగ్డే రాగా అర్జున్ రాంపాల్ వేసిన క్యారెక్టర్ బాబీ డియోల్ తో చేయించారు. సాటి పోలీస్ ఆఫీసర్ కు ఇచ్చిన మాట కోసం ఆయన కూతురిని ఆర్మీలో చేర్పించే బాధ్యత తీసుకున్న హీరో కథే జన నాయకుడు. మెయిన్ పాయింట్ యధాతధంగా తీసుకున్నారు.

జైల్లో ఇంట్రడక్షన్, మమితను కిడ్నాప్ చేసి ఫ్యాక్టరీలో దాచి పెడితే విజయ్ వచ్చి కాపాడటం, అడవిలో ఫైట్, ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గెటప్ వగైరాలన్నీ భగవంత్ కేసరి నుంచి పెద్దగా మార్పులు చేయకుండా వాడుకున్నారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా కావడంతో కథలో ఉన్న పొలిటికల్ థ్రెడ్స్ లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు.

ప్రకాష్ రాజ్ తో పాటు ఇతర క్యాస్టింగ్ దీని కోసం వాడుకున్నారు. అవినీతి, దుర్మార్గం తదితర అంశాలను టచ్ చేస్తూ సీరియస్ గా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీమేక్ హ్యాండిల్ చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న దర్శకుడు హెచ్ వినోత్ మరోసారి తన చేతివాటం చూపించాడు.

ఇదంతా ఓకే కానీ ఇప్పుడీ సినిమాని మన తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరం. తెలిసిన కథ అందులోనూ బాలయ్య లాంటి బ్లాక్ బస్టర్ హీరో నటించిన మూవీ ఇప్పటికే ఓటిటి, శాటిలైట్ ఛానల్స్ బోలెడుసార్లు చూసేశారు. మళ్ళీ అదే కథను రిపీట్ చేయడం అందులోనూ ఇంత సంక్రాంతి పోటీలోనూ పట్టుబట్టి విడుదలకు రెడీ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.

అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పెద్దగా మేజిక్ కనిపించలేదు. మేకింగ్ చాలా రిచ్ గా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా విజయ్ తమిళ ఫ్యాన్స్ కు మాత్రం జన నాయకుడు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయంగా ట్రైలర్ నమ్మకాన్ని కలిగించింది.

This post was last modified on January 3, 2026 7:35 pm

Share

Recent Posts

రామ్‌చరణ్ రావడం అర్జునకి ప్లస్సవుతుందా

ఇట్లు అర్జునకు ఇండస్ట్రీలో దక్కుతున్న మద్దతు చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాగార్జున వరకు బిగ్ షాట్స్…

2 hours ago

పవన్ కళ్యాణ్ విడాకులపై మాట్లాడొద్దు – టీడీపీ, వైసీపీ సూచన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని,…

2 hours ago

లోక‌ల్‌ ఎఫెక్ట్‌: జ‌గ‌న్ – 2.0లో మార్పులు.. !

వైసీపీ భవిష్యత్తుకు, పార్టీ పునర్నిర్మాణానికి ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టబోయే పాదయాత్ర అత్యంత కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు…

2 hours ago

మంగళవారం వచ్చినా మోత తగ్గడం లేదే

రామాయణ పార్ట్ 1 వసూళ్లు కొత్త చరిత్ర రాస్తున్నాయి. మొదటి వారం కాకుండానే 700 కోట్ల వైపు పరుగులు పెడుతున్న…

3 hours ago

‘ఈసారి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే గెలిచినా… నా రాజకీయ సన్యాసమే’

వైసీపీ నాయ‌కులు వెంక‌ట‌న్నా అని పిలుచుకునే అనంత‌పురం వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి తాజాగా పెద్ద…

4 hours ago

అమెరికాలో SBI గ్రాండ్ ఎంట్రీ..

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  శుభవార్త అందించింది. తమ అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాలోని…

4 hours ago