హాట్‍ ఫోటో: చలికాలంలో సెగలు!

రామ్‍ చరణ్‍ తొలి హీరోయిన్‍ అయిన నేహా శర్మ ఆ తర్వాత తెలుగు చిత్ర రంగంలో కంటే హిందీలోనే పలు చిత్రాల్లో నటించి అదృష్టం పరీక్షించుకుంది. ఆమెకు అక్కడ అదృష్టం కలిసి రాలేదు కానీ తన అందం మాత్రం గుర్తింపుకి నోచుకోకుండా పోలేదు. అందుకే ఇన్‍స్టాగ్రామ్‍లో తనకు కోటీ పది లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. ఇప్పటికీ చక్కటి దేహాకృతి మెయింటైన్‍ చేస్తోన్న నేహా పదే పదే తన పరువాలను ఫాలోవర్లకు కనువిందుగా వడ్డిస్తుంటుంది.

ఈ ఏడాది లాక్‍డౌన్‍ వల్ల చాలా మంది తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంకా మాల్దీవులకి వెళ్లి బికినీ ఫోటోలు పెడుతోన్న వారి జాబితాలోకి నేహా చేరలేదు. కాకపోతే గత ఏడాది ఇదే సమయంలో హవాయి వెళ్లినపుడు బికినీలో దిగిన ఫోటోను షేర్‍ చేసుకుంది. చలికాలంలో సెగలు రేపేంతలా వున్న నేహా శర్మ ఫోటోకి లైకులు వెల్లువలా వచ్చిపడ్డాయి. దాదాపు పది లక్షల లైక్స్ తో ఈ వారంలో ఇన్‍స్టాగ్రామ్‍లో బాగా ట్రెండ్‍ అయిన ఫోటోల్లో ఒకటిగా ఇది నిలిచింది.