ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి తనయుడైన ఆది.. పుట్టి పెరిగింది చెన్నైలోనే. తమిళంలో హీరోగా పలు చిత్రాలు చేసి విజయాలూ అందుకున్న ఆది.. తెలుగులో అప్పుడప్పుడూ నటిస్తున్నాడు. ఇక్కడ ఎక్కువగా అతను విలన్ పాత్రలే చేశాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో ‘సరైనోడు’ చేసి మంచి పేరు సంపాదించిన ఆది.. ఇప్పుడు ‘అఖండ-2’ లాంటి భారీ చిత్రంలో బాలయ్యకు విలన్‌గా నటించడం విశేషం. ఈ సినిమా అతడికి ఇంకా ఎక్కువ పేరు తెస్తుందని అంచనా వేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘అఖండ-2’ రిలీజయ్యే రోజే ఆది హీరోగా నటించిన సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రమే.. డ్రైవ్.
‘అఖండ-2’ డిసెంబరు 5న వస్తుందన్న అంచనాతో 12న అనేక చిన్న సినిమాలను షెడ్యూల్ చేసుకున్నారు నిర్మాతలు. కానీ ‘అఖండ-2’ అనూహ్యంగా వాయిదా పడి 12కు షిఫ్ట్ అయింది. దీంతో ఆ రోజు రావాల్సిన పలు చిత్రాలను వాయిదా వేశారు. కానీ మోగ్లీ, అన్నగారు వస్తారు చిత్రాలతో పాటు ‘డ్రైవ్’ కూడా 12కే ఫిక్స్ అయింది.
డ్రైవ్ కొన్నేళ్ల ముందు మొదలైన సినిమా. షూట్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ బాగా ఆలస్యం అయింది. భవ్య క్రియేషన్స్ బేనర్ మీద ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని జెనూస్ మహమ్మద్ రూపొందించాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఐతే లాంగ్ డిలేయ్డ్ మూవీ కావడం, పెద్దగా పబ్లిసిటీ చేయకపోవడంతో ఈ సినిమాకు బజ్ క్రియేట్ కాలేదు. మరి రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే సినిమా పుంజుకుంటుందేమో చూడాలి. ఇటు విలన్‌గా, అటు హీరోగా ఒకే రోజు బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్న ఆదికి ఎలాంటి ఫలితం వస్తుందో?
This post was last modified on December 11, 2025 2:06 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…