కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ సప్తసాగారాలు దాటి సైడ్ ఏబి ఇతర భాషల్లో అంత విజయం సాధించకపోయినా తనకొచ్చిన పేరు మాత్రం చాలా పెద్దది. తర్వాత చేసిన సినిమాలు ఆశించిన విజయం సాధించనప్పటికీ ఆఫర్లు మాత్రం ఆగడం లేదు. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, విజయ్ సేతుపతి ఏస్ దారుణంగా బోల్తా కొట్టినా తనకేం తేడా జరగలేదు. శ్రీమురళి బఘీరా ఫ్లాప్ కాగా శివరాజ్ కుమార్ భైరతి రన్గల్ ఓ మోస్తరుగా కర్ణాటకలో ఆడింది. ఇప్పుడు తన చేతిలో జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ కాంబో మూవీ ఉంది. షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టిన ఈ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.
రాబోయే అక్టోబర్ 2 విడుదల కాబోయే కాంతార చాప్టర్ 1లోనూ నటించి మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి ఆమెకు పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇచ్చినట్టు టాక్ ఉంది. ఇవి కాకుండా తాజాగా యష్ టాక్సిక్ లోనూ ఛాన్స్ కొట్టేసినట్టు ముంబై అప్డేట్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో హీరోయిన్ కియారా అద్వానీ కాగా ఇప్పుడు రుక్మిణి వసంత్ పేరు వినిపించడం చూస్తుంటే యష్ కి జోడిగా ఇద్దరు భామలు ఉంటారనే విషయం అర్థమవుతోంది. నయనతార, హ్యూమా ఖురేశీ, తారా సుతారియా ఇతర తారాగణం కాగా మార్చి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.
ఇవి కాకుండా శివ కార్తికేయన్ సరసన ఒక తమిళ మూవీ రుక్మిణి వసంత్ ఖాతాలో ఉంది. వాస్తవానికి తారక్ నీల్ సినిమా ఒప్పుకున్నప్పుడు అది రిలీజయ్యే దాకా ఇంకే కమిట్ మెంట్స్ ఇవ్వకూడనే నిబంధన రాసుకునట్టు అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ముందు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ కన్నా ఆరు నెలలు ఆలస్యం కావడంతో అది పాటించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏదైతేనేం ఇప్పుడు తను బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. దేనికవే ఆయా హీరోల కెరీర్లలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న క్రేజీ మూవీస్ కావడంతో టార్గెట్ సరైన దిశలోనే వెళ్తోంది. అన్ని బడ్జెట్లు కలిపిస్తే వెయ్యి కోట్ల పైమాటే.
Gulte Telugu Telugu Political and Movie News Updates