Movie News

వైజయంతి కొడుకుది పెద్ద నేపథ్యమే

డెవిల్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ చేసిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇటీవలే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసిన టీమ్ విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు. వేసవి స్లాట్లన్నీ బిజీగా ఉండటంతో వీలైనంత సోలో డేట్ సంపాదించేందుకు ఆప్షన్లు చూస్తోంది. టైటిల్ కోసం పెద్ద కసరత్తే చేశారు. ముందు అనుకున్న మెరుపు వద్దనుకుని విజయశాంతి పోషించిన వైజయంతి పాత్ర పేరు వచ్చేలా పెట్టడం వెనుక కళ్యాణ్ రామ్ ఒత్తిడే ఎక్కువ ఉందని సమాచారం. రెగ్యులర్ కమర్షియల్ ఫీలింగ్ రాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారట.

అసలు వైజయంతి పేరుకి పెద్ద చరిత్ర ఉంది. 1990లో విజయశాంతి కెరీర్ ని మలుపు తిప్పిన కర్తవ్యంలో ఆవిడ పేరు అదే. ఈ సినిమా ఎంతగా పాపులరంటే అప్పట్లో ఆడపిల్లలకు ఈ పేరు పెట్టేందుకు తల్లితండ్రులు ముచ్చటపడేంత. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కర్తవ్యంలో యువతిగా ఉన్న వైజయంతికి తర్వాత పెళ్ళై కొడుకు పుట్టి అర్జున్ అని పేరు పెట్టుకున్నాక అతను చట్టం ముందు దోషిగా నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటుందనే ఆలోచన మీద దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ కథ రాసుకున్నారట. సరిలేరు నీకెవ్వరు తర్వాత నటించనని చెప్పిన లేడీ అమితాబ్ ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదేనట.

సో ఒకప్పుడు బాబాయ్ బాలకృష్ణతో ఎన్నో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకున్న విజయశాంతి ఇప్పుడు తనకు తల్లిగా నటించడం పట్ల కళ్యాణ్ రామ్ సెంటిమెంట్ గా కూడా ఫీలవుతున్నాడు. నలభై కోట్ల దాకా బడ్జెట్ అయ్యిందని వినికిడి. థియేటర్ బిజినెస్ కోణంలో కాకుండా కంటెంట్ డిమాండ్ చేయడం వల్లే అంత ఖర్చు పెట్టారని, ప్రేక్షకులను మెప్పిస్తే సులభంగా వెనక్కు తెస్తుందనే నమ్మకం నిర్మాతలకు వచ్చేసిందట. బింబిసార తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్టు కళ్యాణ్ రామ్ కు దక్కలేదు. అమిగోస్, డెవిల్ రెండూ నిరాశపరిచాయి. అందుకే అర్జున్ సన్నాఫ్ వైజయంతి మీద శ్రద్ధ తీసుకుంటున్నారు.

This post was last modified on March 10, 2025 9:52 am

Share

Recent Posts

రజినీ అంటే పిచ్చి… స్టార్ క్రికెటర్ ఏం చేశాడంటే?

ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్…

3 hours ago

టైగర్‌పై దాడి… విదేశాల్లో ఉద్యోగం!

రెండు రోజుల కిందట ముంబయి వీధుల్లో జనం అంతా చూస్తుండగా.. టైగర్ ష్రాఫ్ లాంటి పేరున్న బాలీవుడ్ నటుడి మీద…

4 hours ago

తాగి పాట పాడిన లెజెండ‌రీ సింగ‌ర్?

ద‌లేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగ‌ర్. తుణుక్ తుణుక్ తున్.. స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్…

4 hours ago

యష్ ముందే చెప్పడం సరికాదేమో

నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ…

5 hours ago

తెలంగాణ‌కు ప్రకృతి విపత్తులా మారిన ఎల్‌నినో

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం ప్రకృతి విపత్తులా మారింది. ఫ‌లితంగా రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాత లోటు నెల‌కొంది. రాబోయే 6 నుండి…

5 hours ago

ముద్ర‌గ‌డ కుటుంబ రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు?

వైసీపీ త‌ర‌ఫున ముద్ర‌గ‌డ కుటుంబానికి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఎంత‌? ప‌ద్మ‌నాభం మృతి చెందిన త‌ర్వాత‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన…

6 hours ago