ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

aavesham

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఫహద్ ఫాసిల్ మాస్ విశ్వరూపానికి కేరళలో ఏకంగా వంద కోట్ల దిశగా పరుగులు పెట్టడం ట్రేడ్ ని విస్మయపరిచింది. పుష్ప విలన్ గా మనకు సుపరిచితుడైపోయిన ఫహద్ ఫాసిల్ ని మ్యాచ్ చేసే నటుడు ఎవరితోనైనా తెలుగులో రీమేక్ జరిగితే బాగుంటుందనే ఆలోచన పలువురు నిర్మాతల్లో కలిగింది. ట్విస్ట్ ఏంటంటే అనుకున్న టైం కన్నా ముందుగా ఇది ఓటిటిలో రాబోతోందని లేటెస్ట్ అప్డేట్. అది కూడా వచ్చే వారమే.

అమెజాన్ ప్రైమ్ వేదికగా మే 9 నుంచి ఆవేశం స్ట్రీమింగ్ ఉంటుందని అనధికార సమాచారం. ఇలాంటి వార్తలు ఊరికే పుట్టుకురావు. తొంబై శాతం సందర్భాల్లో నిజమే అయ్యాయి. అయితే కేవలం ఒక భాషలోనే వస్తుందా లేక మల్టీ లాంగ్వేజెస్ లో అనునదిస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. వచ్చాకే తెలుస్తుంది. కామెడీ టచ్ ఉన్న మాస్ రౌడీగా ఫహద్ ఫాసిల్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. నాలుగో వారంలోకి అడుగు పెడుతున్నా హైదరాబాద్ లో ఇంకా సబ్ టైటిల్స్ తో ఆడిస్తున్నారంటే ఏ రేంజ్ లో ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు జీతూ మాధవన్ కి పెద్ద పేరొచ్చింది.

ఒకవేళ ఎవరైనా టాలీవుడ్ స్టార్ రీమేక్ చేయాలనుకున్నా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్. గతంలో గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ లాంటివి ఈ ఓటిటిల వల్లే ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితాలు అందుకోలేదు. కారణం డిజిటల్ లో సులభంగా అందుబాటులో ఉండటమే. అసలు ఏ గొడవ లేకుండా ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ తరహాలో డైరెక్ట్ గా డబ్బింగ్ చేస్తే ఏ సమస్యా ఉండదు. లేదూ హక్కులు కొని మనోళ్లతోనే తీయాలని ఎవరైనా నిర్మాత ప్రయత్నిస్తే బాగానే ఉంటుంది కానీ జాప్యం చేయకుండా ఉంటే బెటర్. పుష్ప, ఆవేశం దెబ్బకు ఫహద్ ఫాసిల్ డిమాండ్ మాములుగా లేదు.