ప‌ట్టిసీమ ఆరేడు నెల‌ల్లో పూర్త‌వుతుందా?

ప‌ట్టిసీమ ఆరేడు నెల‌ల్లో పూర్త‌వుతుందా?

ఏపీ స‌ర్కారు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ప‌ట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ప్రాజెక్టు ఆరంభంలోనే.. ఏడాదిలో పూర్తి చేసి నీళ్లు ఇస్తామ‌ని చెప్ప‌టం తెలిసిందే.

చెప్పిన మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే.. వాయు వేగంతో ప‌నులు చేయుస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టు అంటే ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచే విధానానికి చెక్ చెబుతూ.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప‌ట్టిసీమ ప్రాజెక్టు ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు అందేలా చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు ఉన్నారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ఆయ‌న ప‌ట్టిసీమ ప్రాజెక్టును మ‌రో ఆరేడు నెల‌ల్లో పూర్తి చేయ‌నున్న‌ట్లు చెప్పారు. రాయ‌ల‌సీమ‌కు నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టు రికార్డు స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగితే.. అధికార‌ప‌క్షంగా తిరుగులేని విజ‌యం సాధించిన‌ట్లు అవుతుంద‌ని భావిస్తున్నారు.

ప‌ట్టిసీమ ప్రాజెక్టుతో పాటు.. చెక్ డ్యాంలు.. ఊట చెరువుల నిర్మాణం.. పొలాల్లో గుంట‌లు త‌వ్వ‌టం ద్వ‌రా వ‌ర్ష‌పు నీటిని సంర‌క్షిస్తామ‌ని చెప్పిన ఆయ‌న‌.. చిత్రావ‌తి న‌దిపై నాలుగు చెక్‌డ్యాంలు నిర్మించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మాటల్లో చెబుతున్న స్పీడ్ పాల‌న విష‌యంలో ఫాలో అయితే.. చంద్ర‌బాబుకు తిరుగు ఉండ‌ద‌ని చెబుతున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు