కొన్ని ఛానెళ్ల‌కే ఎలా వ‌చ్చాయి..?

కొన్ని ఛానెళ్ల‌కే ఎలా వ‌చ్చాయి..?

అడ‌గాల్సిన పాయింట్ ను కాస్త ఆల‌స్యంగా అడ‌గ‌టం మొద‌లు పెట్టారు తెలంగాణ తెలుగుదేశం నేత‌లు. ఆప‌రేష‌న్ రేవంత్ వ్య‌వ‌హారంలో అడ్డంగా బుక్ అయి.. చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉన్న ఆయ‌న‌కు సంబంధించి రాజ‌కీయ క‌ల‌క‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. రేవంత్ రెడ్డిని బుక్ చేసిన నేప‌థ్యంలో.. మొత్తం ప్రొఫెష‌న‌ల్ గా ప‌ని చేసిన‌ట్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ చెప్పిన విష‌యాన్నే చూస్తే.. మ‌రి అంత ప్రొఫెష‌న‌ల్‌గా ప‌ని చేస్తే.. రేవంత్ ఎపిసోడ్ కు చెందిన సీడీలు కొన్ని ఛాన‌ళ్ల‌కు ఎందుకు వెళ్లాయి?

వీడియో ఫుటేజ్ ని తాము బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని ఏకే ఖాన్ స్వ‌యంగా చెప్పిన నేప‌థ్యంలో.. ఈ సీడీల్ని ఎవ‌రు రిలీజ్ చేశారు. ఎవ‌రు మీడియా సంస్థ‌ల‌కు పంపార‌న్న విష‌యంపై అస‌లు విష‌యాలు అధికారికంగా బ‌య‌ట‌కు వ‌స్తే.. ఇందులోని రాజ‌కీయ కోణం బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే.. ఇలాంటి విష‌యాల్ని మొద‌టే మాట్లాడాల్సిన తెలుగుదేశం నేత‌లు ఇప్పుడిప్పుడే గొంతు విప్పుతున్నారు.

ఒక విమ‌ర్శ‌.. ఇద్ద‌రు నేత‌ల‌న్న చందంగా కేసీఆర్‌.. జ‌గ‌న్ ల‌ను క‌లిపి విమ‌ర్శ‌లు చేసేందుకే టీటీడీపీ నేత‌లు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేసీఆర్‌..జ‌గ‌న్ ఇద్ద‌రూ ర‌హ‌స్య మిత్రుల‌న్న టీటీడీపీ నేత‌లు ఎల్ ర‌మ‌ణ‌.. న‌ర్సారెడ్డి.. సండ్ర వెంక‌ట వీర‌య్య త‌దిత‌రులు.. వారిపై మ‌రిన్ని ఆరోప‌ణ‌లు చేశారు.

తెలంగాణ‌లోని ఏ స‌మ‌స్య పైనా గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌ని జ‌గ‌న్ ఇప్పుడు చంద్ర‌బాబుపై మాత్రం ఆరోప‌ణ‌లు చేయ‌టానికి క‌ల‌వ‌టం రాజ‌కీయ దురుద్దేశం కాక మ‌రేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌.. మూడు ఎమ్మెల్సీ స్థానాలు మాత్ర‌మే గెలిచే అవ‌కాశం ఉన్న కేసీఆర్‌.. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్ని ఎలా సొంతం చేసుకున్నార‌ని నిల‌దీస్తున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు