బాబు, కేసీఆర్ లిద్దరూ రాజీనామా చేయాలి, వారిని అరెస్ట్ చేయాలి!

బాబు, కేసీఆర్ లిద్దరూ రాజీనామా చేయాలి, వారిని అరెస్ట్ చేయాలి!

తెలుగు రాష్ట్రాల సీఎంలిద్దరూ రాజీనామా చేయాలని అంటున్నాడు కాంగ్రెష్ నేత షబ్బీర్ అలీ! ఒకసారి చంద్రబాబు , కేసీఆర్ ఇద్దరూ రాజీనామా చేస్తే ఒక పీడ పోతుందని ఈయన అంటున్నాడు. వారిద్దరికీ ముఖ్యమంత్రి పదవుల్లో ఉండే అర్హత లేదని ఈ కాంగ్రెస్ నేత స్పష్టం చేశాడు. తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్ అటు చంద్రబాబుపై ఇటు కేసీఆర్ పై ఒకేసారి విరుచుకుపడ్డారు.

మరి ఎవరో ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఒక ఎత్తు కానీ.. ఇలా ఇద్దరూ ఒకేసారి రాజీనామా చేసేయాలని డిమాండ్ చేయడం ఏమిటి? అంటే.. ఇది రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించిన స్పందన! నామినేటెడ్ ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ ఏసీబీకి దొరికిపోయి రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ ఈ కాంగ్రెస్ నేత ఇలా స్పందించాడు.

ఈ వ్యవహారంలో కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. చంద్రబాబు, కేసీఆర్ లిద్దరూ దోషులే అని షబ్బీర్ అలా అంటున్నాడు. రేవంత్ రెడ్డి పాత్ర ధారి అని.. సూత్రధారి చంద్రబాబు అని ఈ ఎమ్మెల్సీగారు వ్యాఖ్యానించారు. బాబు చెప్పాడు కాబట్టే రేవంత్ రెడ్డి ఈ కొనుగోలు వ్యవహారానికి తెర తీశాడని.. అయితే ఇలా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే దారుణమైన ఐడియా మొదట వచ్చింది మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడికే అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆరోపించారు. కాబట్టి వాళ్లిద్దరూ పదవులకు రాజీనామా చేయాలని.. వాళ్లిద్దరినీ అరెస్టు చేయాలని ఈయన డిమాండ్ చేశాడు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు