చరణ్‌ బయటకు రావల్సిందేనా?

చరణ్‌ బయటకు రావల్సిందేనా?

గడిచిన ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ గొడవపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాటర్‌లో ముందు ఫిర్యాదు చేసిన ఆ ఇద్దరూ, తరువాత అబ్బే ఏం లేదంటూ పోలీసు స్టేషన్‌ నుండి వెళ్లిపోయారు.

దీనిపై రభస చెయ్యడానికి డిసైడైన మన పొలిటికల్‌ ప్రత్యర్ధులు మెగా జులుం నసించాలి అంటూ నినాదాలు చేస్తూ, కొంతమంది యాకంగా హెచ్‌.ఆర్‌.సి. వద్దకు వెళ్ళి చరణ్‌ను బుక్క చెయ్యడంటూ వేడుకున్నారు. ఇంతలో ఈ విషయంలో ఒక సర్కులర్‌ విడుదల చేసిన చరణ్‌, సదరు టెక్కీలు తనకు క్షమాపణ చెప్పారని, ర్యాష్‌గా డ్రైవ్‌ చేసి తనను బాధించినట్లు వారు గ్రహించారని అందులో పేర్కొన్నాడు. ఇదే విషయంపై రాజకీయ నాయకులు స్పందిస్తూ, అసలు తన్నులు తిన్నదీవారే, కేస్‌ పెట్టిందివారే, కెస్‌ వద్దన్నది వారే, ఇప్పుడు క్షమాపణ చెప్పింది కూడా వారేనా అంటూ ఆశ్చర్యపడుతున్నారు.

అసలు జనాలకు క్లారిటీ ఇవ్వకుండా, ఫ్యాన్స్‌ను సైతం కాస్త ఇబ్బందికి గురిచేస్తున్న చరణ్‌, తనే స్వయంగా వచ్చి ఈ విషయంపై పెద్ద విప్పితే ఎంతో బాగుంటుంది. ఏమంటావ్‌ చరణ్‌?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు