కొత్త జతగాళ్లు సాంతం ముంచేట్లున్నారు?

కొత్త జతగాళ్లు సాంతం ముంచేట్లున్నారు?

కొత్తగా చేరిన జతగాళ్లు.. అయితే గియితే కోవర్టులు కావచ్చునని కూడా కొందరు ఆరోపించవచ్చు గానీ.. వారు ఏకంగా పార్టీని సాంతం ముంచేలా కూడా కనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో కాంగ్రెసు పార్టీ డ్రామా ఆడుతోందని, తాము మాత్రం వెనక్కు తగ్గే సమస్యే లేదని.. విలీనం ప్రస్తావన కూడా తేబోమని.. ఒకవైపు వచ్చే ఎన్నికల మీద బోలెడన్ని ఆశలతో ఉన్న కేసీఆర్‌.. తెగేసి చెబుతూ ఉంటే.. ఇటీవలే ఆ పార్టీలో చేరిన కాంగ్రెసు ఎంపీలు మాత్రం.. రాష్ట్రం వచ్చేట్లయితే తెరాస విలీనం అయిపోయినా అందులో తప్పేం ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. చేరిన పార్టీకి అప్పుడే అంత్యకాలాన్ని దగ్గరకు తెస్తున్నారు.

కాంగ్రెసు ఎంపీ మందా జగన్నాధం ఢిల్లీలో మాట్లాడుతూ.. చాలా చాకచక్యంగా తన సొంత డబ్బా కొట్టుకున్నారు. తాను, ఎంపీ వివేక్‌ ఇద్దరూ పార్టీ వీడి తెరాసలో చేరినందువల్లనే కాంగ్రెసు పార్టీ స్పందించిందని, ఇప్పుడు నిర్ణయం దిశగా కదులుతోందని మందా వాక్రుచ్చుతున్నారు. అంటే  ఇప్పుడు కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉండడం పూర్తిగా వారిద్దరి క్రెడిట్‌  మాత్రమే అన్నట్లుగా ఆయన మాటలు ధ్వనిస్తున్నాయి.
ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టినా.. మందా జగన్నాధం తెరాస.. కాంగ్రెస్‌లో విలీనం అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయన్నట్లుగా వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English