క‌డియం నైపుణ్యం చూసి షాక్ తినాలె

క‌డియం నైపుణ్యం చూసి షాక్ తినాలె

కేవ‌లం రూ.20.. రూ.30కోట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎంట్రీటాక్స్ నిర్ణ‌యంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంత‌గా ఇబ్బంది ప‌డుతున్న విష‌యంపై ప‌లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎంట్రీటాక్స్ పుణ్య‌మా అని ప‌లు వ‌స్తువులు.. సేవ‌ల ధ‌ర‌లు పెర‌గ‌టం తెలిసిందే. ఈ ఎంట్రీటాక్స్ కార‌ణంగా తెలంగాణ‌కు ఏడాదికి రూ.100కోట్లు వ‌స్తే.. ఏపీకి రూ.70 కోట్ల వ‌ర‌కూ ఆదాయం వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ రెండు రాష్ట్రాల‌కు వ‌చ్చే ఆదాయాన్ని లెక్కేసిన‌ప్పుడు.. ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి కాస్తంత ఎక్కువ ఆదాయం వ‌స్తుంది. ఈ కార‌ణంతో ఏపీ ప్ర‌జ‌ల‌పై భారం మోపేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వెనుకాడ‌లేదు.

తెలంగాణ రాష్ట్రం ఎంట్రీటాక్స్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌టంతో.. ఏపీ కూడా ఎంట్రీ టాక్స్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో.. త‌న సొంత ప్ర‌జ‌ల‌పై కూడా కేసీఆర్ ప‌రోక్షంగా భారం మోపిన‌ట్లు అయ్యింది. ఇలా ఏపీకి నుంచి వ‌చ్చే రూపాయి విష‌యంలో మ‌హా క‌రుకుగా వ్య‌వ‌హ‌రించే తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు..త‌న‌కు అవస‌ర ప‌డితే మాత్రం ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న‌టానికి తాజా ఉదంతం ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు.

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగి..త‌ర్వాత కాలంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరి.. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌డియం శ్రీ‌హ‌రి.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌లిశారు.

ఒక‌నాటి త‌న బాస్ ని క‌డియం ఎందుకు క‌లిస‌న‌ట్లు అన్న సందేహానికి స‌మాధానం దొరికింది. ఆంధ్రాలో విస్తారంగా ఉండే యూక‌లిప్ట‌స్ వుడ్ ను యాభైశాతం స‌బ్సిడీతో స‌ర‌ఫ‌రా చేస్తే.. వ‌రంగ్‌లోని రేయాన్స్ ప‌రిశ్ర‌మ మ‌ళ్లీ స్టార్ట్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కోరారు. త‌మ‌కు అవ‌స‌ర‌మైన యూక‌లిప్ట‌స్‌ను ద‌ర్జాగా తెప్పించుకోవాల్సిన ధ‌నిక రాష్ట్రం.. యాభై శాతం స‌బ్సిడీ కోసం ఏపీని దేబిరించ‌టం ఏమిట‌ని ప‌లువురు నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. మ‌రోవైపు.. తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌రం వ‌స్తే.. ఎంత జాగ్ర‌త్త‌గా వ‌చ్చి సాయం అడుగుతారో తాజాగా క‌డియం ఉదంతం చూస్తే ఇట్టే అర్థం అవుతుంద‌ని చెబుతున్నారు.

క‌డియం చేసిన విన‌తిని.. ఏపీ ముఖ్య‌మంత్రి ప‌రిశీలిస్తాన‌ని చెప్పిన‌ట్లు చెబుతున్నారు. త‌మ రాష్ట్రానికి ఆర్థిక స‌మ‌స్య‌లుఉన్న నేప‌థ్యంలో ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెబితే.. మ‌రోవైపు క‌డియం శ్రీ‌హ‌రి మాత్రం.. ఏపీ ముఖ్య‌మంత్రితో త‌మ విజ్ఞప్తికి పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యార‌ని చెబుతున్నారు. మ‌రి.. ఈ విష‌యంపై ఏపీ ముఖ్య‌మంత్రి అధికారికంగా ఏం చెబుతారో. త‌మకు అవ‌స‌రం కాని వ‌చ్చి ప‌డితే.. దాన్ని సాధించుకునేందుకు తెలంగాణ స‌ర్కారు ఎంత నైపుణ్యం ప్ర‌ద‌ర్శించింద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English