క్లాసు..మాసును మిక్స్ చేస్తున్న సీఎం

క్లాసు..మాసును మిక్స్ చేస్తున్న సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. డిసెంబరు 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగించాల్సిందేనని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ వడివడిగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తనకున్న మాస్ ఇమేజ్ ను కాపాడుకోవడంతో పాటు హైదరాబాద్ కు క్లాస్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్ అభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మారుస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భాగ్యనగరాన్ని 400 విభాగాలుగా విభజించి ఇంఛార్జ్ లను నియమించి క్లీన్ సిటీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఇందులో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు, అధికారులు బాధ్యతలు తీసుకుంటారని వివరించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రతలో పౌరులందరి భాగస్వామ్యం కావాలన్నారు.

క్లీన్ సిటీ కోసం సినీ నటులు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖుల సేవలు వినియోగించుకుంటామని సీఎం తెలిపారు. కళాబృందాలతో నగరమంతా ప్రచారం చేయిస్తామని చెప్పారు.

మే 16న స్వచ్ఛ హైదరాబాద్ అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని మే 16న గవర్నర్ చేతులమీదుగా ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు.

స్వచ్చంద సేవా సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, హాస్పిటల్లు, ఐటీ ఉద్యోగులు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. నగరంలోని డంపింగ్ యార్డులు, మూత్రశాలలు, మురుగునీరు, మంచినీటి సదుపాయం తదితరాల గురించి కసరత్తు చేయనున్నట్లు ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు