రేవంత్ ఫైర్‌; పావురాల గుట్ట‌లో పావుర‌మైంది గుర్తుందా?

రేవంత్ ఫైర్‌; పావురాల గుట్ట‌లో పావుర‌మైంది గుర్తుందా?

మామూలుగానే మాట‌ల‌తో చెడుగుడు ఆడుకుంటారు. జ‌న‌సంద్రం అయిన వేదిక పైనుంచి మాట్లాడే అవ‌కాశం వ‌స్తే ఊరుకుంటాడా? అందులోకి పార్టీ అధినేత స‌మ‌క్షంలో పాల‌మూరులో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో తెలంగాణ తెలుగుదేశం నేత.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాట‌ల‌తో మంట పుట్టించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న చేసిన ప‌లు వ్యాఖ్య‌లు తీవ్ర‌స్థాయిలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఆయ‌నేమ‌న్నారంటే..
- టీడీపీ స‌భ‌ను చూసి కేసీఆర్ భ‌య‌ప‌డ్డారు.
- పాల‌మూరు స‌భ‌కు వ‌చ్చిన జ‌న‌సందోహాన్ని చూసి తెలంగాణ ప‌ది జిల్లాల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఉప్పొంగుతార‌ని క‌రెంటు క‌ట్ చేయించారు.
- జురాల కోయిల్ సాగ‌ర్ వ‌ర‌దై పారితే పాల‌మూరు ప‌ట్ట‌ణం ఎలా ఉంటుందో ఈ రోజు మ‌హ‌బూన‌గ‌ర్ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో ఉప్పొంగింది.
- బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఇందుకేనా ముఖ్య‌మంత్రిని చేసింది. ఇందుకే క‌రెంటుకోత‌లా?
- తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు బ‌ల‌య్యారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత విద్యార్థుల్ని అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు.
- పాల‌మూరుకు పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు వ‌చ్చార‌ని ప‌ది చోట్ల క‌రెంటు క‌ట్ చేయించారు.
- రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేస్తాన‌ని నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ అంటే.. 48 గంట‌ల్లోపు పావురాల గుట్ట‌లో పావుర‌మై.. ఎక్క‌డి పోయారో తెలీదు.
- ఇప్పుడు కేసీఆర్ కూడా టీడీపీని ఖాళీ చేస్తాన‌ని అంటున్నారు.
- ఖాళీ చేయ‌టానికి టీడీపీ ఏమీ.. ఫాంహౌస్‌లో మందు బాటిల్ కాదు.
- తెలుగుదేశం నేత‌ల్ని కొనొచ్చేమో కానీ.. కార్య‌క‌ర్త‌ల్ని మాత్రం కొన‌లేరు.
- అసెంబ్లీలో నా క‌ళ్ల‌ల్లోకి చూసి మాట్లాడే ధైర్యం కేసీఆర్ కు ఉందా?
- తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని క‌దిలించే శ‌క్తి ఎవ‌రికీ లేదు.
- బంగారు తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు త్యాగాలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో ఎవ‌రూ త్యాగాలు చేయ‌లేదు.
- కేసీఆర్‌.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు సింహాస‌నం మీద కూర్చొని దోచుకుంటున్నారు.
- తెలంగాణ ఉద్య‌మంలో గ‌ద్ద‌ర్‌.. విమ‌ల‌క్క లాంటి క‌వులు క‌ళాకారులు కీల‌క‌భూమిక పోషిస్తే.. ఇప్పుడు వారిపై అక్ర‌మ‌కేసులు పెట్టి అరెస్ట్ చేయాల‌ని చూస్తున్నారు.
- తెలంగాణ ఆర్భాటంగా నిర్వ‌హించిన స‌మ‌గ్ర‌స‌ర్వే ఏమైంది? ఎందుకు చేశారు? దాంతో సాధించిందేమిటి?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు