క‌లిసిరాని కాలంలో ఉత్త‌రాంధ్ర త‌మ్ముళ్లు

క‌లిసిరాని కాలంలో ఉత్త‌రాంధ్ర త‌మ్ముళ్లు

ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి చెందిన త‌మ్ముళ్లు తీవ్ర వేద‌న‌లో ఉన్నారు. వారిని క‌దిలిస్తే చాలు.. తీవ్ర‌స్థాయిలో త‌మ ఆవేద‌న‌ను ఏక‌రువు పెడుతున్నారు. ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి త‌మ‌ను ఎలా బ‌లిచేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి.. అదే విష‌యాన్నిబాబును అడ‌గొచ్చు క‌దా? అంటే.. ఆస‌లు ఆయ‌న మా ముఖాలు చూస్తేనే మండిప‌డిపోతున్నారు.. చిరాకుల‌తో చిర్రుబుర్రులాడుతున్నార‌ని గొణుగుతున్నారంటున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటూ సుదీర్ఘంగా త‌మ బాధ‌లు చెప్పుకొస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మాదిరే ఉత్త‌రాంధ్ర జిల్లాలోనే పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఇది ఒక‌టి చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారితే.. మ‌రో అంశం ఈ మ‌ధ్య‌న మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తూ టీడీపీ స‌ర్కారుకు కంట్లో న‌ల‌క‌లా మారిందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భోగాపురం వ‌ద్ద నిర్మించాల‌ని భావిస్తున్న ఎయిర్‌పోర్ట్ వ్య‌వ‌హారం ఇప్పుడు ర‌చ్చ ర‌చ్చ‌గా మార‌టం.. విప‌క్షాలు విరుచుకుప‌డ‌టంతో పాటు.. విప‌క్ష నేత జ‌గ‌న్ సైతం దూకుడుగా ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌టం తెలిసిందే. రాజ‌ధాని కోసం 35వేల ఎక‌రాలు సేక‌రిస్తుంటే.. విజ‌య‌న‌గ‌రంలో నిర్మించ త‌ల‌పెట్టిన ఎయిర్‌పోర్ట్ కు ఏకంగా 15వేల ఎక‌రాలు కావాల‌న‌టం.. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు షురూ చేయ‌టంతో అక్క‌డి రైతులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

వారికి స‌ర్ది చెప్పే విష‌యంలో ఉత్త‌రాంధ్ర నేత‌లు విఫ‌లం కావ‌టం చంద్ర‌బాబు మండిప‌డుతున్నారు. రాజ‌ధాని కోసం 35వేల ఎక‌రాలు స‌మీక‌రించిన‌ప్పుడు ఎలాంటి గొడ‌వ చోటు చేసుకోకుండా పూర్తి చేస్తున్న‌ప్పుడు.. ఎయిర్ పోర్ట్ కోసం సేక‌రిస్తున్న భూమి విష‌యంలో ఎందుకంత ర‌చ్చ జ‌రుగుతుందంటూ మంత్రుల్ని.. ఉత్త‌రాంధ్ర త‌మ్ముళ్ల‌ను చంద్ర‌బాబు క‌డిగేయ‌టంతో వారికి ఏం స‌మాదానం చెప్పాలో అర్థం కాని ప‌రిస్థితి.

దీనికితోడు.. చంద్ర‌బాబు మ‌రింత‌గా చెల‌రేగిపోయి.. మీకు చేత‌కాక‌పోతే చెప్పండి నేనే రంగంలోకి దిగుతాన‌ని వ్యాఖ్యానించ‌టం త‌మ్ముళ్ల‌ను తీవ్రంగా బాధిస్తోంది. త‌మ‌ను పూచికపుల్ల‌ల మాదిరి తీసిపారేయ‌టంపై వారు వాపోతున్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి 15వేల ఎక‌రాలు ఎందుకు అవ‌స‌రం? ఎలా అవ‌స‌రం? అన్న విష‌యానికి సంబంధించిన ప్ర‌శ్న‌ల‌కు తాము స‌మాధానం చెప్పే ప‌రిస్థితుల్లో లేమ‌ని చెబుతున్నారు. మ‌రోప‌క్క జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. ముంబ‌యి.. చెన్నై ఏయిర్‌పోర్ట్ లకు వెయ్యి.. 1500 ఎక‌రాల్లో ఏర్పాటు చేసిన‌ప్పుడు భోగాపురానికి మాత్రం 15వేల ఎక‌రాలు ఎందుక‌న్న ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌లేద‌ని త‌మ్ముళ్లు వాపోతున్నారు. ఓ ప‌క్క గ్రూపు రాజ‌కీయాలు.. మ‌రోప‌క్క ఎయిర్‌పోర్ట్ వ్య‌వ‌హారంతో ఉత్త‌రాంధ్ర నేత‌లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న ప‌రిస్థితి. మ‌రి.. ఈ గ‌డ్డు ప‌రిస్థితి నుంచి  త‌మ్ముళ్లుఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు