టీడీపీతో టీఆర్ఎస్ ది దశలవారీ గేమ్..!

టీడీపీతో టీఆర్ఎస్ ది దశలవారీ గేమ్..!

ఒకే రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తెరాస వైపు లాగేయవచ్చు. అధికారమే పరమావధి అయిన ప్రస్తుత రాజకీయాల్లో అది పెద్ద కథేం కాదు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి ఖర్చు పెట్టుకొన్న మొత్తాన్ని ఇస్తాం.. సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తాం.. అంటే ఎమ్మెల్యేలు సులువగా పార్టీలు మారేస్తున్నారు! సెంటిమెంట్లు.. విలువలకూ స్థానం లేదిప్పుడు!

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడం పెద్ద విషయం కాదు. అయితే అలా అందరినీ ఒకేసారి పార్టీలోకి చేర్చుకోవడం వల్ల ఒక్క రోజు మాత్రమే ఉపయోగం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తున్నట్టుగా ఉంది. అందుకే దశల వారీగా ఒక్కో ఎమ్మెల్యేనూ పార్టీలో చేర్చుకొంటూ.. టీఆర్ఎస్ అనునిత్యం ఈ చేరికల అంశం వార్తల్లో నిలిచేలా చూసుకొంటోంది.

అవతల చంద్రబాబు నాయుడు పాలమూరు లో సభకు రెడీ అవుతున్నట్టుగానే.. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే  టీఆర్ఎస్ లో చేరడం ఖాయం అయ్యింది. ఆ తతంగం పూర్తి కాగానే.. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తెరపైకి వచ్చారు. వీరు త్వరలోనే టీఆర్ఎస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సీరియల్ కొనసాగుతూనే ఉండేలా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాన్ని అమలు పెడుతోంది. తద్వారా తెలుగుదేశం పార్టీని అనుక్షణం అభ్రదతా భావంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం బాగానే  ఉన్నట్టుంది. ఇది ఆ పార్టీకి ఎంత వరకూ ప్లస్ అవుతుందనేదే సందేహం!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు