టీ ప్లీన‌రీలో చికెన్ ప్ర‌మోష‌న్‌

టీ ప్లీన‌రీలో చికెన్ ప్ర‌మోష‌న్‌

బ‌ర్డ్ ఫ్లూ కార‌ణంగా తెలంగాణ చికెన్ కు.. గ‌డ్ల ప‌రిశ్ర‌మ‌కు భారీగా న‌ష్టం వాటిల్లిన విష‌యం తెలిసిందే. బ‌ర్డ్ ఫ్లూ అంటేనే భ‌య‌ప‌డే ప‌లువురు తెలంగాణ ప్రాంతానికి చెందిన కోళ్ల‌ను తెప్పించుకోవ‌టంలో వెనుకంజ వేస్తున్నారు. వాస్త‌వానికి.. హైద‌రాబాద్ లోని హ‌య‌త్ న‌గ‌ర్ ప్రాంతంలోని కొద్దిపాటి ఫౌల్ట్రీ ఫారంల‌లో బ‌ర్డ్‌ఫ్లూ రావ‌టం.. దాని తీవ్ర‌త‌ను గుర్తించిన తెలంగాణ‌స‌ర్కారు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స్పందించి.. చ‌ర్య‌లు తీసుకోవ‌టంతో న‌ష్టం క‌నీస స్థాయికి త‌గ్గింది.

బ‌ర్డ్‌ఫ్లూ కార‌ణంగా ఎలాంటి ఇబ్బంది లేద‌న్న విషయాన్ని ప్ర‌చారం చేసేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం అంతంత‌మాత్రంగా ఉండ‌టంతో.. కోళ్ల ప‌రిశ్ర‌మ‌దారులు మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ.. చికెన్ వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని తేల్చేశారు. చికెన్ వండే స‌మ‌యంలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త వ‌ద్ద వండుతార‌ని.. దీని కార‌ణంగా ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌ద‌ని చెబుతున్నారు. అయినా.. ఆశించినంత స్పంద‌న ఉండ‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. చికెన్ మీద నెల‌కొన్న సంశ‌యాల్ని ప‌టాపంచ‌లు చేసేందుకు.. తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్షం త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న ప్లీన‌రీ సంద‌ర్భంగా చికెన్ త‌దిత‌ర కోళ్ల‌కు సంబంధించిన వంట‌కాల్ని భారీగా వినియోగిస్తార‌ని చెబుతున్నారు.

చికెన్ ఉత్ప‌త్తుల కార‌ణంగా ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ఇంత‌కు మించిన వేదిక మ‌రొక‌టి ఉండ‌ద‌ని భావిస్తోన్న‌ట్లు చెబుతున్నారు. చికెన్‌కు పూర్వ క‌ళ సంత‌రించుకోవ‌టానికి.. ప్లీన‌రీని ఒక వేదిక‌లా వాడుకోవాల‌ని భావిస్తున్న స‌మాచారం. మొత్తంగా బ‌ర్డ్ ఫ్లూ కార‌ణంగా దెబ్బ తిన్న ఇమేజ్ ను.. టీ ప్లీన‌రీలో తిరిగి వెన‌క్కి తీసుకొచ్చేలా వంట‌కాలు సిద్ధంగా చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అంటే.. టీ ప్లీన‌రీలో కోళ్ల‌కు సంబంధించిన వంట‌కాల‌తో భారీగా ప్ర‌మోట్ చేయ‌నున్నార‌న్న మాట‌.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English