పరిటాల శ్రీరామ్ కట్టడి చేసే పనిలో టీడీపీ నేతలు..?!

పరిటాల శ్రీరామ్ కట్టడి చేసే పనిలో టీడీపీ నేతలు..?!

అనంతపురం జిల్లా తెలుగుదేశం యువనేత పరిటాల శ్రీరామ్ పై తెలుగుదేశం వారి కన్నులే పడినట్టుగా ఉన్నాయి. ఎలాగైనా శ్రీరామ్ ను పరిమిత పాత్రకు తగ్గించాలని.. అతడు తమ మీద ఎక్కి అధికారాన్ని చెలాయించే లోపే.. అతడిని కట్టడి చేయాలని తెలుగుదేశం నేతలు ప్రయత్నాలు ఆరంభించారు. భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలవైపు వచ్చి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు శ్రీరామ్.

ప్రస్తుతం వీరి కుటుంబం రాప్తాడు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఈ నియోజకవర్గంలో తల్లి సునీతను అలాగే ఉంచి.. తను మరో నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని శ్రీరామ్ భావిస్తున్నాడు. అందుకోసం పలు నియోజకవర్గాలపై దృష్టి సారించాడు. ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేలే ఉన్నారు!

దీంతో వారికి భయం మొదలైంది. శ్రీరామ్ తమ నియోజకవర్గాలపై ఎక్కడ పడతాడో.. తమ భవిష్యత్తుపై ఎక్కడ దెబ్బకొడతాడో..అని వారు ఆందోళనకు గురవుతున్నారు. అనంతపురం, ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు శ్రీరామ్ నుంచి ముప్పు ఉంది. వీటిలో ఏదో ఒక నియోజకవర్గంపై శ్రీరామ్  దృష్టిసారిస్తాడని.. అక్కడ నుంచి భవిష్యత్తులో  పోటీచేసే అవకాశాలను పరిశీలిస్తున్నాడని తెలుస్తోంది.

శ్రీరామ్ చర్యలే ఈ దీనికి రుజువులు. దీంతో ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారు. తమ నియోజకవర్గంలో శ్రీరామ్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ వారు పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. మరి వారి ఫిర్యాదులు ఎంత వరకూ ప్రభావం చూపిస్తాయో!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు