బాబు కాదు.. ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడు!

బాబు కాదు.. ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడు!

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సుప్రిమో గా ఉన్న చంద్రబాబు నాయుడు హోదాలను మార్చుకొనే పనిలో పడ్డారు. తనయుడిని ప్రమోట్ చేసుకోవడం గురించి బాబు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది. చిన్న బాబు లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి బాబు జాతీయ ఆధ్యక్షుడిగా మారనున్నారట!  లోకేష్ కు కీలక బాధ్యతలను అప్పగించి.. వారసుడిని ప్రమోట్ చేసుకోవడం గురించి బాబు అలా ముందుకు పోతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బాబు  జాతీయాధ్యక్ష హోదాలోకి వెళతారట. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి  ఒక అధ్యక్షుడు. ఏపీ విభాగానికి మరో అధ్యక్షుడు నియమితం అవుతారు. చిన్న బాబు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటారు. ఇదీ తెలుగుదేశం పార్టీ లీడర్ షిప్ స్ట్రక్చర్ కాబోతుందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల నాటికి నారా లోకేష్ ను పూర్తిగా రంగంలోకి దించడానికి బాబు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే లోకేష్ పార్టీ విషయంలోనూ.. ప్రభుత్వం విషయంలోనూ జోక్యం చేసుకొంటున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు.. లైజనింగ్ ఆఫీసర్లను నియమించుకొని.. పాలనను పర్యవేక్షిస్తున్నాడు.

ఇలాంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా లోకేష్ ను మరింతగాఎదిగేలా చేయడానికి బాబు ప్రయత్నిస్తున్నాడు. ఎలాగూ ఎన్టీఆర్ కుటుంబం నుంచి కూడా ఎలాంటి అడ్డంకులూ లేవు కాబట్టి.. బాబు ఆలోచనలకు, వ్యూహాలకు అడ్డుపడే వాళ్లే ఉండరేమో!

 

TAGS