ఆ.. టీ ఎమ్మెల్యేలు.. రైతులేనంట‌

ఆ.. టీ ఎమ్మెల్యేలు.. రైతులేనంట‌

మీడియాలో వ‌చ్చే వార్త‌ల‌కు పెద్ద‌గా స్పందించ‌ని సంస్కృతి ఉన్న స‌ర్కారులో టీఆర్ ఎస్ కూడా ఒక‌ట‌న్న ఆరోప‌ణ ఉంది. ఇక‌.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌చ్చే వార్త‌ల విష‌యంలో వారు పెద్ద‌గా రియాక్ట్ కార‌న్న మాట త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది.

అలాంటిది.. మీడియాలో వ‌చ్చిన ఒక వార్త‌కు తెలంగాణ రాష్ట్ర అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు ప‌లువురు టోకుగా స్పందించారు. తామ వాద‌న‌ను వినిపించారు. వారిని అంత‌లా క‌ల‌వ‌ర‌పెట్టిన ఆ వార్త ఏమిటంటే..

ఇజ్రాయిల్ లో జ‌రిగే రైతు స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు తెలంగాణ స‌ర్కారు ఒక బృందాన్ని ఎంపిక చేసింది. ఈ టీంలో.. అధికారుల‌తో పాటు అద‌ర్శ రైతుల్ని పంప‌నున్నారు. మ‌రి.. ఆద‌ర్శ రైతులు ఎవ‌రంటే. అధికార‌ప‌క్షానికి చెందిన ప‌లువురుఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే పీఎస్ కూడా. ఈ వార్త అన్ని మీడియాల్లోనూ ప్ర‌ముఖంగా రావ‌టంతో తెలంగాణ‌రాష్ట్ర అధికార‌ప‌క్షం తొలిసారి ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

దీంతో.. ఈ వార్త‌ను ఖండించ‌టానికి ఆరోప‌ణ వ‌చ్చిన ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వ‌చ్చారు. తామంతా రైతు కుటుంబాల నుంచి వ‌చ్చామ‌ని.. తాము ఇప్ప‌టికి వ్య‌వ‌సాయం చేస్తున్నామ‌ని.. తాము పండించిన పంట‌లో.. త‌మ‌కు అవ‌స‌ర‌మైన మేర‌కు ఉంచుకొని.. మిగిలింది అమ్ముతున్నామంటూ వ్యాఖ్యానించ‌ట‌మే కాదు.. కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని బ‌లంగా స‌మ‌ర్థించారు.

ఆద‌ర్శ‌రైతుల స్థానే అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేల‌ను విదేశీ ప‌ర్య‌ట‌న‌కు పంప‌టం త‌ప్పంటూ మీడియాలో వార్త‌లు రావ‌టంపై అసంతృప్తి చేసిన టీ ఎమ్మెల్యేలు గంగుల క‌మలాక‌ర్‌.. విద్యాసాగ‌ర్ రావులు త‌మ వాద‌న‌ను వినిపించారు. తాము ఇప్ప‌టికి రైతుల‌మేన‌ని.. మొద‌ట రైతు అయ్యాకే ఎమ్మెల్యే అయ్యామ‌ని వారు వెల్ల‌డించారు.

వ్య‌వ‌సాయ భూమి ఉంటేనో.. మ‌నుషుల్ని పెట్టించి వ్య‌వ‌సాయం చేయిస్తుంటేనే రైతులు అయిపోరు. నిత్యం రాజ‌కీయం చేస్తూ.. రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో ఫుల్ బిజీగా ఉండే నేత‌లు.. అద‌ర్శ రైతుల‌మ‌ని చెప్పుకుంటే.. మ‌రి.. నిజ‌మైన ఆద‌ర్శ రైతుల ప‌రిస్థితేంటి..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు