ఏపీకి సింఫుల్‌గా సంపాదించేయొచ్చుగా బాబు..?

ఏపీకి సింఫుల్‌గా సంపాదించేయొచ్చుగా బాబు..?

వినేవాడు ఉండాలే కానీ.. చెప్పేవాడు చెల‌రేగిపోతార‌ని ఊరికే అన‌రు మ‌రి. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌లు వింటే ఇవే మాట‌లు గుర్తుకు వ‌స్తాయి. ప‌దేళ్ల విరామం త‌ర్వాత ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబుకు.. ఖ‌జానా లోటు బెంబేలెత్తిస్తోంది. నిధుల కోసం ఏ నెల‌కు ఆ నెల కిందామీదా ప‌డిపోతూ.. హ‌మ్మ‌య్యా పూర్తి చేశామ‌నిస్తున్న ప‌రిస్థితి.

ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల విష‌యంలో ఇన్ని ఇబ్బందులు ప‌డుతున్న చంద్ర‌బాబు.. ఆర్థికాంశాలకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని చెప్పుకొచ్చారు. పీక‌ల్లోతు అప్పుల్లో ఉండి.. నిత్యం కేంద్ర‌సాయం కోసం ఎద‌రుచూస్తున్న ఆయ‌న‌.. డ‌బ్బు సంపాదించ‌టం ఎంత సింఫులో తెలుసా అంటూ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువ ఐఏఎస్ అధికారుల‌కు చెప్పుకొచ్చారు.

ఇక్క‌డ మ‌రో విష‌యం చెప్పాలి. సివిల్ స‌ర్వీసెస్ ఇన్ ఏ గోబ‌లైజ్డ్ వ‌ర‌ల్డ్ అన్న అంశంపై ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేత ప్ర‌సంగం ఇప్పించాల‌ని భావించిన సీనియ‌ర్ అధికారులు.. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న ఐఏఎస్‌ల‌కు ఛాయిస్ వ‌దిలేశారు. ఈ సంద‌ర్భంగా ఓటింగ్ పెట్ట‌గా అత్య‌ధికులు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేరును సూచించారు.

దీంతో.. ముస్సోరీలోని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జాతీయ ప‌రిపాల‌న అకాడ‌మీలో ప్ర‌సంగించేందుకు బాబు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాస్త క‌ష్ట‌ప‌డితే డ‌బ్బు సంపాదించ‌టం చాలా తేలిక అని చెప్పుకొచ్చారు. సివిల్స్ లోకి వ‌చ్చే వారు.. దేశానికి సేవ చేయాల‌న్న ఉద్దేశ్యంతో వ‌స్తార‌ని పేర్కొన్నారు.

డ‌బ్బు సంపాదించ‌టం అంత పెద్ద విష‌యం కాద‌న్న‌ట్లు పేర్కొన్న చంద్ర‌బాబు.. అప్పుల్లో ఉన్న ఏపీని ఆర్థిక క‌ష్టాల్లో నుంచి ఎందుకు బ‌య‌ట ప‌డేయ‌లేక‌పోతున్నారో..? యువ ఐఏఎస్ అధికారుల ద‌గ్గ‌ర గొప్ప‌లు చెప్పుకోవ‌టంలో త‌ప్పు లేదు. కానీ..  ప్ర‌స్తుతం తాను ఎదుర్కొంటున్న ఆర్థిక స‌మ‌స్య‌ను ద‌గ్గ‌ర‌గా ఉన్న విష‌యాన్ని తేలిగ్గా చెప్పేయ‌టం.. చేత‌ల్లో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని ఏ మాత్రం మెరుగు ప‌ర్చ‌లేని ఆయ‌న‌.. ఆర్థిక అంశాన్ని అంత తేలిగ్గా ఎలా చెప్పేస్తారో..?

డ‌బ్బు సంపాదించ‌టం అంత తేలికే అయితే.. ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని గ‌డిచిన ప‌ది నెలల్లో ఎందుకు మార్చ‌న‌ట్లు..? మాట్లాడేట‌ప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది క‌దా బాబు..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు