అనైతికం అయినా.. టీఆర్ఎస్ అదే దారిలో..!

అనైతికం అయినా.. టీఆర్ఎస్ అదే దారిలో..!

పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తిప్పుకోవడంలో తెలంగాణ రాష్ట్ర సమితి తీరు మారడటం లేదు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా.. తెలంగాణ రాష్ట్ర సమితి లెక్క చేయడం లేదు. తమపార్టీ తరపున కాకుండా.. వేరే పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలను తెరాస తనవైపుకు తిప్పుకొంటూనే ఉంది. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటికే అనేక మందిని ఇలా చేర్చుకొన్న తెరాస ఇప్పుడు మరో తెలుగుదేశం ఎమ్మెల్యేపై కన్నేసినట్టుగా తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకొనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేర్చుకొంటే మంచిదని ఈ గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారట. ఈ మేరకు చర్చలు జరుగుతున్నయని తెలుస్తోంది. అధికార పార్టీ నుంచి వస్తున్న బంపర్ ఆఫర్ల నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే కూడా తెరాప ప్రతిపాదన గురించి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ , కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెరాసవైపు వెళ్లారు. అధికార యావలో తాము గెలిచి వచ్చిన పార్టీని పక్కన పెట్టి వీరు జంపింగులు చేశారు. ఇలాంటి వారిపై అనర్హత వేటు పడాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. దాదాపు ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో ఇప్పటి వరకూ జింపింగ్ ఎమ్మెల్యేలపై చర్యలు లేకపోవడంతో.. పార్టీలు మారాలనుకొనే వారికి కూడా అవకాశం లభిస్తోంది. వీరు ఎంచక్కా చేరిపోతున్నారు. మరి ఇదంతా అనైతికం అయినా.. అధికార పార్టీ అయితే అలానే ముందుకు వెళుతోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు