మండ‌లి ఛైర్మ‌న్ కు నోటీసులు

మండ‌లి ఛైర్మ‌న్ కు నోటీసులు

తెలంగాణ మండ‌లి ఛైర్మ‌న్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో ఉన్న వారికి ఇలాంటి పరిస్థితి కాస్తంత అరుదుగానే జ‌రుగుతుంటుంది. తాజాగా.. తెలంగాణ మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ అధికార‌ప‌క్షంలోకి తెలంగాణ తెలుగుదేశం పార్టీ స‌భ్యుల్ని విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏ ప్రాతిప‌దిక‌న విలీనం చేశార‌న్న విష‌యాన్ని రెండు వారాల్లో మండ‌లి ఛైర్మ‌న్ తెల‌పాల‌ని కోర్టు పేర్కొంది.

విభ‌జ‌న అనంత‌రం.. తెలంగాణ అధికార‌ప‌క్షం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను చేప‌ట్ట‌టం..వివిధ పార్టీల‌కు సంబంధించిన  ప‌లువురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అధికార‌ప‌క్ష గూటికి చేర‌టం తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే విప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి.

ఆ మ‌ధ్య‌న మండ‌లిలోని తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన బి వెంక‌టేశ్వ‌ర్లు.. లక్ష్మీనారాయ‌ణ‌, ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి.. ఎండీ స‌లీంల‌ను గుర్తిస్తూ సీట్లు కేటాయిచాల‌ని మండ‌లి ఛైర్మ‌న్ హోదాలో స్వామిగౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు త‌గిన‌ట్లు ఒక బులిటెన్ ను విడుద‌ల చేశారు. దీన్ని స‌వాలు చేస్తూ.. టీడీపీ నేత‌లు కోర్టును ఆశ్ర‌యించ‌టంతో తాజా ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి.. ఈ వివాదం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుందో..?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు