వారిద్దరిలో బాబు మద్దతు ఎవరికి..?!

వారిద్దరిలో బాబు మద్దతు ఎవరికి..?!

ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి విషయంలో తెలుగుదేశం ఎంపీల మధ్య పోరాటం తీవ్రస్థాయికి చేరింది. ఇద్దరు తెలుగుదేశం ఎంపీలు.. రెండు  కమిటీలను ఏర్పాటు చేసుకొని వాటికి తమే అధ్యక్షులుగా ఎన్నికై.. తమది అధికారిక కమిటీ అంటే, తమది అధికారిక కమిటీ అంటూ వాదించుకొంటున్నారు. తమకు గుర్తింపు ఉందంటే .. తమకే గుర్తింపు ఉందని అంటున్నారు.

ఈ విషయంలో గత కొన్ని రోజులు జరుగుతున్న రగడ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కోర్టుల వరకూ వెళ్లింది. ఎవరో ఒకరు తేలిపోవాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వారిలో ఎవరికి మద్దతునిస్తాడు? ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకరేమో దశాబ్దాలుగా పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్న సీఎం రమేశ్  మరొకరు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి సన్నిహితుడిగా మారిన.. గల్లాజయదేవ్. ఈయన ఫ్యామిలీతో బాబుకు దశాబ్దాల నుంచినే సన్నిహిత సంబంధాలున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో బాబు ఎవరికి మద్దతు పలుకుతాడు? ఎవరిని వెనక్కు తగ్గమని వారిస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. జయదేవ్ ఏమో బాబు మద్దతు కూడా తనకే ఉందని అంటున్నాడు. సీఎం రమేశ్ ఏమో కోర్టుకు ఎక్కి జయదేవ్ కమిటీకి చట్టబద్ధతలేదని వాదిస్తున్నాడు! ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ లమధ్య రచ్చ సాగుతోంది. ప్రస్తుతానికి అయితే సీఎం రమేశ్ కు అవకాశాలు హరించుకుపోయాయి. అయితే ఆయనకు నారా లోకేష్ మద్దతు ఉందని అంటున్నారు. మరి వీరిలో చివరికి నెగ్గేది ఎవరో!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు