ఈ భారీ అంత‌స్థుల మోజేంటి చంద్రుళ్లు

ఈ భారీ అంత‌స్థుల మోజేంటి చంద్రుళ్లు

చెప్పుకుంటూ పోతే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి.. తెలంగాణ ముఖ్య‌మంత్రి  కె చంద్ర‌శేఖ‌ర్‌రావుకు పోలిక‌లు చాలానే ఉన్నాయి. ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ద‌గ్గ‌ర నుంచి.. ప‌థ‌కాలు అమ‌లు చేసే విష‌యంలోనూ వీరిద్ద‌రి మ‌ధ్య ఒక‌టే అంశాలు చాలానే క‌నిపిస్తాయి.

ప్ర‌భుత్వ కార్యాల‌యాలు మొత్తం ఒకేచోట ఉండాల‌న్న ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. కొద్ది నెల‌ల  క్రితం ఒక నిర్ణ‌యం తీసుకున్నారు.
ఇందులో భాగంగా.. ప్ర‌స్తుతం ఉన్న స‌చివాల‌యాన్ని అక్క‌డ నుంచి.. ఎర్ర‌గ‌డ్డ‌లోని చెస్ట్ ఆసుప‌త్రికి లో ఏర్పాటు చేయాల‌ని భావించారు. ఇందుకోసం చెస్ట్ ఆసుప‌త్రిని త‌ర‌లించాల‌ని.. ఆ స్థానంలో కొత్త‌గా భారీ అంత‌స్థుల భ‌వ‌నం ఒక‌టి ఏర్పాటు చేయాల‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌న్నీ ఒకేచోట ఉండేలా నిర్ణ‌యం తీసుకోవ‌టంతో పాటు.. అధికారుల క్వార్ట‌ర్స్ ను కూడా నిర్మించాల‌న్న ఆలోచ‌ను ప్ర‌క‌టించారు.

స‌చివాల‌యాన్ని త‌ర‌లించే విష‌యంలో ఒక‌సారి వాస్తు అని.. మ‌రోసారి స్థ‌లం స‌రిపోవ‌టం లేద‌ని చెప్పిన కేసీఆర్ మాట‌లు వివాదాస్ప‌దం కావ‌టం తెలిసిందే. తాజాగా ఏపీ రాష్ట్ర రాజ‌ధానిని నిర్మించాల‌ని భావిస్తున్న ప్రాంతంలో నిర్మించే ఒక‌భారీ క‌ట్ట‌డం గురించి ఏపీ సీఎం తాజాగా వెల్ల‌డించారు.

అర‌వై అంత‌స్థుల‌లో ఒక భారీ భ‌వ‌నాన్ని నిర్మాస్తామ‌ని.. ఇందులోనే అన్నీ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఉండ‌టంతోపాటు.. ముఖ్య‌మంత్రి ప్ర‌యాణానికి అనువుగా.. హెలిపాడ్‌ను కూడా ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఏపీ రాష్ట్ర రాజధాని కోసం ఏపీ స‌ర్కారు దాదాపు 35 వేల ఎక‌రాలు సేక‌రించ‌టం తెలిసిందే.

ఇంత‌భారీగా భూముల్ని సేక‌రించ‌టంపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే.. రాజ‌ధాని అంటే స‌చివాల‌యం.. సెక్ర‌టేరియ‌ట్ లాంటివి ఏవో నాలుగు ఉంటే స‌రిపోద‌ని.. ఒక రాజ‌ధాని న‌గ‌రం ఏర్పాటు చేయ‌టం త‌న ఉద్దేశ్యం అని బాబు చెప్ప‌టం తెలిసిందే. కాక‌పోతే.. కాస్త అటూఇటూగా భారీ భ‌వ‌నాల నిర్మాణానికి.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు తెర తీయ‌టం కాస్త ఆస‌క్తిక‌ర‌మే క‌దూ. అయినా.. కేసీఆర్ అంటే డ‌బ్బులున్న ధ‌నిక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి..ఆయ‌న నాలుగు రూపాయిలు ఖ‌ర్చు పెట్ట‌గ‌ల‌రు. కానీ.. బాబుది అంతా లోటు బ‌డ్జెట్ సినిమా. అయిన‌ప్ప‌టికీ.. 60అంత‌స్తుల భారీ భ‌వ‌న నిర్మాణం ఏమిటో..

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు