పంజరంలో చిలక - సిబిఐ

పంజరంలో చిలక - సిబిఐ

సిబిఐని రాజకీయ పంజరంలో ఉన్న చిలకగా సుప్రీంకోర్టు అభిప్రాయపడిందట. సిబిఐ పైన రాజకీయ పెత్తనాన్ని సుప్రీంకోర్టు తప్పు పడుతున్నది కొన్ని రోజులనుంచి. బొగ్గు కుంభకోణం సహా ఇతర కేసుల దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అటార్నీ జనరల్‌, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ప్రవర్తనను తప్పుబట్టింది. రాజకీయ జోక్యం పెరుగుతూ ఉంటే సీబీఐ స్వతంత్ర హోదాకు చర్యలు తీసుకుంటామని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ అధికారులను సీబీఐ సంప్రదించాల్సిన అవసరం లేదని.. అవసరమైతే వారిని ప్రశ్నించవచ్చునని చెప్పింది. న్యాయ శాఖ మంత్రి సలహా మేరకే సీబీఐ అధికారులను కలిసినట్లు అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు.

బొగ్గు కుంభకోణాన్ని విచారిస్తున్న సిబిఐ, ఈ కుంభకోణంపై తయారుచేసిన నివేదికను న్యాయ శాఖ మంత్రికి చూపడం, ఆయన చేసిన మార్పులను అంగీకరించడం వివాదాస్పదంగా మారింది. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కలిపించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడగా అది అమలు సాధ్యమేనా అనేది చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు