వాడిన కమలం, సత్తా చాటిన హస్తం

వాడిన కమలం, సత్తా చాటిన హస్తం

కర్నాటక ఎన్నికల్లో కమలం వాడిపోయింది, హస్తం సత్తా చాటుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులకు షాక్‌ తగలగా, కాంగ్రెసు పార్టీకి ఘనవిజయం దక్కింది. అధికారంలో ఇప్పటిదాకా ఉన్న బిజెపిని ప్రజలు ఇంకోసారి అధికారంలో కొనసాగించడానికి ఇష్టపడలేదు. కేంద్రంలోని కుంభకోణాలకన్నా, స్వరాష్ట్రంలో బిజెపి అవినీతే అక్కడి ప్రజల మదిలో మెదిలింది. ఫలితం కర్నాటకలో కాంగ్రెస్‌ గెలుపు, బిజెపికి పరాజయం.

ఓటమి కారణాల్ని అన్వేషించడంలో బీజేపీ, గెలుపు ఆనందంలో కాంగ్రెసు పార్టీ ఉన్నాయి. 2014లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి కర్నాటక గెలుపు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వవచ్చును. బిజెపికి మాత్రం కర్నాటక ఫలితాలతో దిమ్మతిరిగిపోయింది. నరేంద్రమోడీ ప్రచారం కలిసి రాలేదని బిజెపి ఆందోళన చెందుతుండగా, రాహుల్‌గాంధీ మ్యాజిక్‌ పనిచేసిందని సంబరపడుతున్నది కాంగ్రెసు పార్టీ. కొత్త పార్టీలు బిఎస్‌ఆర్‌సి, కెజెపి బొక్కబోర్లా పడ్డాయి ఎన్నికల ఫలితాల ముంగిట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు