బొత్సగారూ.. కూల్‌ డౌన్‌ సార్‌!

బొత్సగారూ.. కూల్‌ డౌన్‌ సార్‌!

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగరవేయడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో జనాలు ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఇక ఒక అడుగు ముందుకేసిన పిసిసి ఛీఫ్‌ బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అవినీతి వ్యతిరేక పోరాటానికే ప్రజలు మద్దతు పలికారని సెలవిచ్చారు. నిజమా సార్‌?

ఒక ప్రక్కన కాంగ్రెస్‌ పార్టీలో ఉండి కోట్లు దోచుకున్న జగన్‌ జైల్లో ఉంటే, అతనికి సహాయం చేసిన కాంగ్రెస్‌ మంత్రులు రేపో ఇవాళో ఊచలు లెక్కపెడతామా అనే సందిగ్దంలో ఉన్నారు. మరో ప్రక్క కోల్‌ స్కామ్‌కు సంబంధించిన రిపోర్టును అసలు సిబిఐ దగ్గర నుండి న్యాయశాఖామంత్రి ఎందుకు తీసుకొని చూశారో చెప్పలేక సతమతమవుతూ, మరోప్రక్కన హెలికాప్టర్ల స్కాము, 2జి స్పెక్ట్రమ్‌, కామన్‌ వెల్త్‌ గేమ్స్‌, అబ్బో చెప్పుకుంటూ పోతే లిస్టు నక్లెస్‌ రోడ్డు కంటే పెద్దదే.

అవినీతి వ్యతిరేక పోరాటం అని చెబుతున్న బొత్సగారు పైన చెప్పిన స్కాములన్నీ కాంగ్రెస్‌ ఖాతాలోవేనని గమనిస్తే మంచిది. పైగా కర్ణాటలో ప్రజలు వేరే ప్రత్యామ్న్యాయం లేకనే కాంగ్రెస్‌కు ఓటేశారు కాని, ఆ పార్టీపై ఉన్న ఇష్టంతో కాదని విశ్లేషకులు ఎప్పుడో తేల్చేశారు. కూల్‌ డౌన్‌ బొత్సా సార్‌, మన రాష్ట్రంలో కూడా గెలిస్తే అప్పుడు చెప్పండి మీ ఫిలాసఫీ క్లాసులు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు