మోడి.. దక్షణాదిన ఏది నీ వేడి?

మోడి.. దక్షణాదిన ఏది నీ వేడి?

గుజరాత్‌ మోడల్‌లో దేశమంతా తన ప్రభంజనంతో దూసుకుపోతానని, భారతదేశాన్ని మరో గుజరాత్‌గా మార్చేస్తానని, వగైరా ప్రామిస్సులు చేసిన నరేంద్ర మోడి కూడా ముక్కుమీద వేలేసుకున్నారు. కారణం ఒక్కటే. అవినీతితో సావాసం చేస్తే అది నరేంద్ర మోడి అయినా, రాహుల్‌ గాంధీ అయినా జనాలు పెద్దగా లెక్కచెయ్యరు.

ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినట్లు కర్ణాటకలో బిజెపికి ఎదురు దెబ్బతగిలి వెన్నెము విరిగిపోయింది. ఇంత ఘోరంగా ఓడిపోతుందని కల్లో కూడా ఊహించలేదు. కనీసం రెండో స్థానంలో ఉండి ఉంటే బాధ్యతగల అపోజిషన్‌ అనిపించుకునేది కాని, మూడో స్థానంలోకి పడిపోవటంతో కమలం వాడిపోవడం కాదు, ఏకంగా ఎండిపోయిందని కామెంట్లు విసురుతున్నారు ప్రత్యర్ధులు. మరి కేవలం మోడి ప్రచారం చేస్తే చాలు మనం గట్టెక్కుతాం అని తలచిన బిజెపి లీడర్లు అసలు మోడి వేడి ఎందుకు వర్కవుట్‌ కాలేదో అర్ధంకాక తలబాదుకుంటున్నారు.

మోడి ఎన్ని కొత్త కొత్త ప్లాన్స్‌తో వచ్చినా, బిజెపి చేసిన మైనింగ్‌ స్కామ్‌ ముందు అవన్నీ భూస్థాపితం అయిపోయాయని కూడా అనుకోవచ్చు. ఏది ఏమైనా మరోసారి నరేంద్ర మోడి కూడా తన చరిష్మా ఎంతవరకు పనిచేస్తుందో చెక్‌ చేసుకుంటే బెటర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు