జగన్‌ కళ్ళు తెరిస్తే బెటర్‌

జగన్‌ కళ్ళు తెరిస్తే బెటర్‌

చంచల్‌గుడా జైల్లో కూర్చొని రాష్ట్రంలో అధికారం మనదే అంటూ పగటి కలలు కంటున్న వైఎస్సార్‌ కాంగ్రస్‌ అధినేత జగన్‌ నిజాలను గ్రహించాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. మనోడు కొత్తగా ఒక పార్టీ పెట్టేసి బై ఎలక్షన్లలో సింపతి వేవ్‌ వర్కవుట్‌ అయ్యిందని ఇక జీవితాంతం అదే కుదురుతుంది అనుకోవడంలో అర్దంలేదు. ఈ రోజు వెలువడుతున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం.

అవినీతితో, కుమ్ములాటలతో ఒంటికాలిపై తపస్సు చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు కూలదోల్చారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిచినా కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవల్సింది యడ్యూరప్ప, శ్రీరాములు గురించి. బిజెపి నుండి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న యడ్డీ, అలానే కాంగ్రెస్‌ నుండి బయటకొచ్చిన గాలి జనార్దనరెడ్డి ఫ్రెండ్‌ శ్రీరాములు, ఎన్నికల్లో దారుణంగా మట్టికరిచిపోయారు. జనాలు వీళ్లని అందలం ఎక్కిసార్తని ఎన్ని పగటికలలు కన్నారో అన్నింటిపైనా మనోళ్ళు కావేరి నీళ్ళు చల్లేశారు.

ఇక గుజరాత్‌లో గెలిచిన బిజెపి, కర్ణాటకలో ఎలా గెలవలేకపోయిందో, కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌లోకూడా అలానే గెలవలేదన్నది వాస్తవం. మరి తెలుగుదేశంలో వేవ్‌లో జనాలందరూ అటే మొగ్గుచూపితే, జగన్‌ కూడా ఒక శ్రీరామాలు లాగా, ఒక యడ్యూరప్పలాగా గాల్లో మేడలు కట్టుకోవల్సిందేకాని, సిఎం క్యాంపు ఆఫీసులో తిష్టవేయడం అనేది జరగని పని. వింటున్నావా జగన్‌ బాబూ....

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు