ముఖ్యమంత్రి 'సీతయ్య'

ముఖ్యమంత్రి 'సీతయ్య'

ఎవరి మాటా వినడు సీతయ్య అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరు. ఎవరినీ లెక్క చేయక, ఎవరి బెదిరింపులకూ తలొగ్గక డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ముఖ్యమంత్రి అన్న పేరు సంపాదించుకోవడానికి ఆయన ఆరాటపడుతున్నారు. తెలుగుదేశం పార్టీనీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీనీ విమర్శించడం మాటెలాగున్నా టిఆర్‌ఎస్‌ని కిరణ్‌ చాలా గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నమైతే చేస్తూ విశ్లేషకులకూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. 

బయ్యారం వివాదంపై స్పందించడానికి ఎవరైనా తటపటాయించాలి. ఎందుకనగా అది తెలంగాణ అంశానికి ముడిపడి ఉన్నది. కాని కిరణ్‌, బయ్యారంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకోబోమని తేల్చేశారు. ఆ జీవోని రద్దు చేయాలని టిఆర్‌ఎస్‌తో పాటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీలన్నీ అంటున్నాయి. కాంగ్రెసు పార్టీలోని తెలంగాణ ప్రాంత నేతలదీ అదే మాట. కాని వారెవరి మాటనూ  కిరణ్‌ లెక్క చేయడం లేదు. ఏం చేస్తారో చేసుకోండి అంటూనే తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, ముందు ముందు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మెదక్‌ జిల్లా పర్యటనలో చెప్పారు. ఈ సీతయ్య తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు కోపం తెప్పిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజల్ని సంతృప్తి పరచగలుతున్నారేమో అని అనిపిస్తున్నది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English