అనంత‌వ‌ర‌మే ఏపీ ఉగాదికి వేదిక‌

అనంత‌వ‌ర‌మే ఏపీ ఉగాదికి వేదిక‌

తెలుగు నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌లి్న ఏపీ స‌ర్కారు నూత‌న రాజ‌ధానిలో నిర్వ‌హించ‌నుంది. తుళ్లూరు మండ‌లంలోని అనంత‌వ‌రంలో ఉగాది వేడుక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

తొలుత ఉగాది వేడుక‌ల్ని.. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ప్ర‌దేశంలోనే నిర్వ‌హించాల‌ని భావించారు. అయితే.. కొత్త రాజ‌ధాని ప్రాంతంలో నిర్వ‌హించ‌టం బాగుంటుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం కావ‌టంతో.. చివ‌ర‌కు అనంత‌వ‌రంలో నిర్వ‌హించాల‌ని డిసైడ్  చేశారు. మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకల సంద‌ర్భంగా పంచాగాల‌ను.. పంచాగ శ్ర‌వ‌ణ కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేసే వేదిక వ‌ద్ద నిర్వ‌హించ‌నున్నారు.

ఉగాది సంద‌ర్భంగా నిర్వ‌ఙించే వేద‌పండితుల స‌త్కారాలు.. ఉత్త‌మ రైతులు.. శాస్త్ర‌వేత్త‌ల‌కు అవార్డులు.. ప్ర‌శంసాప‌త్రాల‌తో పాటు.. రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతుల అభినంద‌న స‌భ‌ను కూడా ఇక్క‌డ ఏర్పాటు చేయాల‌ని ఏపీ స‌ర్కారు నిర్ణ‌యించింది. తొలి ఉగాది ఏపీ కొత్త రాజ‌ధానికి తొలి పండుగ కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు