ఈటెలను నీళ్లు నమిలించిన జానా

ఈటెలను నీళ్లు నమిలించిన జానా

తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై జానారడ్డి చర్చను ప్రారంభించారు. తన రాజకీయ అనుభవాన్ని రంగరించి మరీ ప్రసంగించిన ఆయన తీరు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలివితో.. బడ్జెట్ ప్రసంగం విన్న వారంతా ఆహా.. ఓహో అని అనటం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం పూర్తి చేసిన వెంటనే ఆయన్ని పలువురు అభినంధించారు. అయితే.. ఈటెల బడ్జెట్ లో ఉన్న లెక్కల చిక్కుల్ని ఒక్కొక్కటిగా విప్పి చెప్పటం మొదలు పెట్టిన జానా ప్రసంగానికి.. అరేరే.. నిజమే కదా అన్న భావన కలగక మానదు.

బడ్జెట్ కేటాయింపులు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని విమర్శించిన జానారెడ్డి.. బడ్జెట్ లో చూపించిన ఆదాయం వచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. ప్రభుత్వం చెప్పిన లెక్కలకు.. వాస్తవానికి మధ్య పొంతన లేదన్నారు. బడ్జెట్ చెప్పిన ప్రకారం తెలంగాణ సర్కారుకు ఆదాయం వచ్చే ప్రసక్తే లేదని.. అంచనాల్లో తక్కువలో తక్కువ రూ.20వేల కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే.. బడ్జెట్ లో పేర్కొన్న డెవలప్ మెంట్ కార్యక్రమాలకు బ్రేకులు పడటం ఖాయమని ఆయన విమర్శించారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి.. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీకి సంబంధించి బడ్జెట్ లో ప్రస్తావన లేదేమిటని ప్రశ్నించారు. ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా ప్రతి అంశాన్ని ప్రస్తావించిన జానా.. ఈటెల రాజేందర్ బడ్జెట్ లోని అసలు రంగును బయటపెట్టే ప్రయత్నం చేసి.. అధికారపక్షాన్ని ఇరుకున పడేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English