పీవీ తెలుగు బిడ్డ కాబట్టే

పీవీ తెలుగు బిడ్డ కాబట్టే

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయడానికి దశాబ్దానికిపైగానే సమయం కాలగర్భంలో కలిసిపోవాల్సి వచ్చినది. అధికారంలో ఉన్నవారి చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం ఎన్టీయార్‌ తెలుగుబిడ్డ కాబట్టే ఆయనకు ఇంతకాలం అవమానం జరిగిందని చెప్పడం నిస్సందేహం.

స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహరావు విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. దేశ రాజధానిలో దివంగత ప్రధానులందరికీ స్మారక 'ఘాట్‌'లు ఉన్నా, పివి నరసింహారావుకి చోటు దక్కలేదు. ఇది శోచనీయం. ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తావిస్తూ తెలంగాణ వ్యక్తి కాబట్టే పివి నరసింహారావుకి అన్యాయం జరిగిందని ఆరోపించింది. తెలుగు వారంటే ఢిల్లీ పాలకులకు చులకన. అందుకే స్వర్గీయ ఎన్టీయార్‌ తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదం తెచ్చారు.

ఎన్టీయార్‌ విగ్రహం కోసం పోరాటం జరిగినట్లుగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారూ పివి నరసింహారావుకి జరిగిన అన్యాయంపై పోరాట బాట పట్టాల్సి ఉంటుంది. ఎందుకనగా తెలుగు ప్రజల ముద్దుబిడ్డ పివి నరసింహారావు. మన తెలుగువాడు ప్రధాని అయినందుకు గర్వించడం కాదు, ఆయనకు సముచిత గౌరవం దక్కకపోవడంపై ఇప్పటికైనా నిలదీస్తేనే ఆయనకు గౌరవం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు