కోవర్టులతో జర జాగ్రత్త

కోవర్టులతో జర జాగ్రత్త

కోవర్టులన్న పదం మావోయిస్టు ఉద్యమంలో ఎక్కువగా వినిపించేది ఒకనాటి రోజుల్లో. ఇప్పుడా మాట రాజకీయాలలో కూడా ఎక్కువగానే వినవస్తున్నది. కారణం కలుషితమైపోయిన రాజకీయాలే. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి కోవర్టుల్లా ఆ పార్టీకి సమాచారం అందించేవారు వివిధ పార్టీలలో ఉంటున్నారు.

కొత్త పార్టీలకు ఈ కోవర్టుల బెడద ఎక్కువగానే ఉంటోంది కూడాను. ప్రజారాజ్యం పార్టీకి ఈ కోవర్టులే పెద్ద దెబ్బకొట్టారని అంటారు. ఇప్పుడు కొత్త పార్టీగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకీ కోవర్టుల బెడద ఉన్నదని ఆ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. ఆయన ఉద్దేశ్యం దాడి వీరభద్రరావు కోవర్టు అనే. దాడి వైఎస్‌ఆర్‌ కాంగ్రెసులోకి రావడాన్ని కొణతాల అన్యమనస్కంగానే స్వాగతించారు.

కాని దాడి విషయంలో ఆయన ఏమీ చేయలేకపోతున్నారని, అందుకే కొణతాలలో అసహనం పెరుగుతున్నదని వార్తలు వినవస్తున్నాయి. ఇదిలా ఉండగా కొణతాల కాంగ్రెసు పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతున్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు