పెదవి విప్పని జూనియర్‌ ఎన్టీయార్‌

పెదవి విప్పని జూనియర్‌ ఎన్టీయార్‌

ఢిల్లీలోని పార్లమెంటులో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ విగ్రహావిష్కరణ గావించారు. రాష్ట్రం నుంచి నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ఢిల్లీకి వెళ్ళారు.

వారిలో జూనియర్‌ ఎన్టీయార్‌ కూడా ఉన్నారుగానీ, రాజకీయాల గురించి అతనేమీ ఎక్కడా మాట్లాడలేదు. తన తండ్రి గురించి బాలకృష్ణ నాలుగు మాటలు చెప్పారు. ఎన్టీయార్‌ వద్ద పనిచేయడం తన అదృష్టమన్నారు చంద్రబాబు. నందమూరి కుటుంబాన్ని ఒక్క చోట చూసే సరికి తనకు చాలా ఆనందం కలిగిందని లక్ష్మీపార్వతి చెప్పారు. కాని జూనియర్‌ ఎన్టీయార్‌ ఎక్కడా ఏమీ మాట్లాడకపోవడంతో తెలుగుదేశం పార్టీకి ఆయన దూరంగా జరిగారని అనుకోవడం సబబేనేమో. 


ఫ్లెక్సీల వివాదంతో జూనియర్‌ ఎన్టీయార్‌కీ తెలుగుదేశం పార్టీకీ దూరం పెరిగింది. ఆ దూరం కారణంగనే చంద్రబాబుని ఢిల్లీలో కూడా జూనియర్‌ ఎన్టీయార్‌ పలకరించనే లేదని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు