కిరణ్‌రెడ్డిపై పితూరీలు

కిరణ్‌రెడ్డిపై పితూరీలు

కాంగ్రెసు అధిష్టానానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ద్వారా కాంగ్రెసులోని కిరణ్‌ వ్యతిరేక వర్గం 'పితూరీ' నివేదిక ఒకటి పంపడం సంచలన వార్తగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే కాంగ్రెసు పార్టీలో ఈ తరహా రాజకీయాలు మామూలే అయినప్పటికీ ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరుగనుండగా పవర్‌ సెంటర్ల సంఖ్య అరడజను వరకు చేరడం, ఆ పవర్‌ సెంటర్లలో చాలావరకు కిరణ్‌ని వ్యతిరేకించేవి కావడం ఆశ్చర్యకరం.

మెజారిటీ ఎంపీలు కిరణ్‌కి వ్యతిరేకంగా అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారంట కూడా. బొత్సగారి పితూరీ నివేదికలో వాస్తవం ఎంతన్నది స్పష్టం కావాల్సి ఉన్నప్పటికినీ, దీనికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు కిరణ్‌ వర్గానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 2014 వరకు అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చబోదని వారు చెప్పడం జరుగుతోంది. కిరణ్‌రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్న నివేదికలపై స్పందించిన అధిష్టానం, 'సమన్వయం' కుదర్చడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీలోని అసమ్మతిని తగ్గించాలని చూస్తున్నదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు