దాడికి అటూ ఇటూ వాయింపే

దాడికి అటూ ఇటూ వాయింపే

తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడిగా పనిచేసిన దాడి వీరభద్రరావు వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో చేరాక ఆయన ఎవరికీ కాకుండా పోయినట్లుగా కనిపిస్తున్నది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీలో ఆయన సొంత నియోజకవర్గం నుంచి నేతలు, కార్యకర్తలు ఎదురు తిరుగుతుండగా, టిడిపిని వీడాక తనకంటూ ఉన్న అభిమానులు, అనుచరులూ ఆయనకు దూరమయ్యారు. ఈ పరిణామాలు దాడి వీరభద్రరావుకి మింగుడు పడ్డంలేదు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిద్దామన్నా ఆయనకంటూ అభిమానగణం లేకుండా పోయినట్లుగా సమాచారం అందుతున్నది.

దాడికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేత కొణతాల రామకృష్ణకు అనకాపల్లి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తల బలం ఉన్నది. ఈ పరిణామాలతో దాడిని చేర్చుకున్నట్టే చేర్చుకుని పక్కన పెట్టాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తున్నదంట. ఇదిలా ఉండగా, దాడి తిరిగి టిడిపిలోకి వస్తారేమోనన్న ఆలోచనతో అతన్ని రాకుండా చేయడానికి తెలుగు తమ్ముళ్ళు అతనికి వ్యతిరేకంగా మీటింగులు పెట్టి తిట్టిపోస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు