కెసిఆర్‌కి బిస్కెట్‌ వేస్తున్న నాగార్జున?

కెసిఆర్‌కి బిస్కెట్‌ వేస్తున్న నాగార్జున?

ఎన్‌ కన్వెన్షన్‌ వివాదంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో నాగార్జునకి పేచీ ఏర్పడిన సంగతి తెలిసిందే. తన ప్రాపర్టీని కాపాడుకునేందుకు నాగ్‌కి కెసిఆర్‌తో తలపడక తప్పలేదు. అయితే ఈ రాష్ట్రంలో ఉంటూ ముఖ్యమంత్రితో వైరం తగదని భావించిన నాగార్జున సీఎంని మచ్చిక చేసుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అఖిల్‌ హీరోగా నిర్మాణంలో ఉన్న తొలి చిత్రంలో సీఎం కూతురు కవితని భాగస్వామిగా చేర్చుకున్నారనే పుకార్లు ప్రచారం అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ తెలంగాణకి చెందిన ఎన్‌. సుధాకర్‌రెడ్డికి ఈ పెద్ద ప్రాజెక్ట్‌ని అప్పగించడంలో మతలబు ఏంటనేది కూపీ లాగిన వారికి ఈ లింకు గురించి తెలిసిందట. అఖిల్‌ని లాంఛ్‌ చేయడానికి పెద్ద నిర్మాతలు సిద్ధంగా ఉన్నా కానీ నాగార్జున ఏరి కోరి నితిన్‌, సుధాకర్‌రెడ్డి చేతికి ఈ సినిమాని అప్పగించడానికి కారణం ఇదే అంటున్నారు. దీంట్లో ఎంత వాస్తవం ఉందనేది ఈ చిత్రంలో ఇన్‌వాల్వ్‌ అయిన వారికే తెలియాలి మరి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు