ఓటమికి ప్రిపేర్‌ చేస్తున్న విజయమ్మ

ఓటమికి ప్రిపేర్‌ చేస్తున్న విజయమ్మ

కింద పడినా  కూడా పైచేయి నాదే అనడంలో ఓ టెక్నిక్‌ ఉంటుంది. తాము కిందపడడం గ్యారంటీ అని ముందే బోధపడినప్పుడు.. కిందపడడంలో ఓ అద్భుతమైన కుట్ర ఉన్నదని ముందే చూపరుల్ని ప్రభావితం చేయడం ద్వారా.. మనం కింద పడిపోయినా కూడా.. వారి సానుభూతి దక్కించుకునేలా చేయడమే ఆ టెక్నిక్‌ . ఈ టెక్నిక్‌ బహుశా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు తెలిసినట్లుగా మరొకరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పటినుంచే తమ పార్టీ శ్రేణులను మానసికంగా ఓటమికి సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతం విజయమ్మ తెలంగాణ జిల్లాల్లో పర్యటన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను కలవడంలో భాగంగా జిల్లాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. విజయమ్మ మంగళవారం నాడు మెదక్‌ జిల్లాకు వెళ్లారు. అక్కడి కార్యకర్తలతో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు రెండు కుమ్మక్కు అయ్యాయంటూ ఆమె విమర్శించారు.

ఇన్నాళ్లూ పాలనలో కాంగ్రెస్‌కు సహకరించడం వరకే తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాల ఆరోపణలు గుప్పిస్తున్న వైకాపా ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో కూడా అదే పనిచేస్తున్నారనే పాట అందుకోవడం విశేషం. పైగా రాబోయే స్థానిక ఎన్నికల్లో తమను ఓడిరచడానికే వారిద్దరూ ఒక్కటవుతున్నారనే మాటల్ని బట్టి.. తమకు చాలా తక్కువ సీట్లే వస్తాయనే భయం ఆ పార్టీ నాయకుల్లో ఇప్పటినుంచే ఉన్న సంగతి అర్థమైపోతోంది. పైగా అసలే వైకాపాకు క్షేత్రస్థాయిలో చాలా తక్కువ బలం ఉన్నదనే సంగతి చాలా కాలంనుంచి అందరికీ తెలిసిన సంగతే.

 ఏదో నాయకుల్ని ప్రభావితం చేసి చేర్చుకుంటున్నారు తప్ప క్యాడర్‌ బలం లేని పార్టీగానే వైకాపా ఉంది. అందుకే విజయమ్మ జిల్లాలు తిరుగుతున్నారు కూడా! ఆ ప్రభావం స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా బయటపడుతుంది. అందుకే ఆమె ముందుచూపుతో.. స్థానిక ఎన్నికల ఓడిపోయినా కవర్‌ చేసుకోవడం కోసం ఇప్పటినుంచే ప్రత్యర్థి పార్టీలు రెండూ కుమ్మక్కు అవుతున్నాయనే పాట ఆరంభించారని విమర్శలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు