నగరం కాస్తా ఊరైంది

నగరం కాస్తా ఊరైంది

ఊరికి.. నగరానికి తేడా ఏంది? ఏం కోరుకుంటే.. అది దొరక్కపోవటం ఊర్లో మామూలే. కానీ.. మహానగరాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. చేతిలో డబ్బులు ఉండాలంటే దొరకనిదంటూ ఉండదు.

కానీ.. తాజాగా సీన్‌ రివర్స్‌ అయ్యింది. సంక్రాంతి పండక్కి పెద్దఎత్తున సీమాంధ్రులు వారి స్వగ్రామాలకు వెళ్లిపోవటంతో హైదరాబాద్‌ నగరంలోని పలు సేవలు అందటం లేదు. మరి.. ముఖ్యంగా టిఫెన్‌ సెంటర్లు.. కర్రీపాయింట్లు లాంటివి భారీగా ఉన్నాయి.

ఏడాది మొత్తంలో పెద్ద పండుగ కావటం.. కుటుంబసభ్యులు.. బంధుమిత్రులు కలుసుకునే అవకాశం ఉండటంతో పాటు.. మూడు రోజుల సెలవులు.. పిల్లలకు వారం.. పదిరోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో సీమాంధ్రులు తమ సొంతూర్లకు భారీగా తరలివెళ్లారు. ఏడాది మొత్తంలో ఇల్లు కదలని వారు సైతం ఊళ్లకు వెళ్లే సమయంలో అందరూ కలిసి వెళ్లటం.. హైదరాబాద్‌లో పనులు చేసుకునే వేలాది మంది పండక్కి ఊరు వెళ్లటంతో హోటళ్లు.. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు.. కర్రీపాయింట్లు లాంటివి మూతపడిన పరిస్థితి.

దీంతో.. పెద్ద హోటల్స్‌ మినహా మిగిలిన హోటళ్లు చాలావరకూ మూతపడ్డాయి. దీంతో.. నిత్యం టిఫిన్‌సెంటర్లు.. కర్రీపాయింట్ల మీద ఆధారపడిన వారి జీవితం దారుణంగా మారింది. దీనికితోడు మారిన లైఫ్‌స్టైల్‌కి పండుగలు.. సెలవు దినాల్లో ఇళ్లల్లో టిఫిన్లు చేయటం బాగా తగ్గిపోయింది. ఇలాంటి వారంతా బజారుకొస్తే దుకాణాలు మూతేసి దర్శనమిస్తున్నాయి. దీంతో.. పలువురు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు.

ఇదేకాదు.. పలు ఆఫీసులు.. సర్వీసు సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. సీమాంధ్రకు చెందిన ఉద్యోగులతో పాటు.. తెలంగాణకు చెందిన వారు సైతం సెలవులపై వెళ్లిపోవటంతో.. సేవలు అందని పరిస్థితి. దీంతో.. మొన్నటివరకూ మహానగరంగా మురిపించిన హైదరాబాద్‌ ఇప్పుడు టిఫిన్లు సైతం దొరకని పల్లెటూరుగా మారిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English