పండగరోజున ప్రశాంతంగా ఉండనీయరా?

పండగరోజున ప్రశాంతంగా ఉండనీయరా?

పండుగ రోజున సరదాగా ఉంటూ.. పిండివంటలు తింటూ.. అయినవాళ్లతో ఆడుతూపాడుతూ గడుపుతుంటారు. కానీ.. సీమాంధ్రలోని కొన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించటం లేదు.

కోడి పందాల మీద హైకోర్టు నిషేధం విధించటం.. దీనికి సుప్రీంకోర్టు స్టేటస్‌ కో జారీ చేయటంతో కోడి పందాల్ని నిరోధించేందుకు పోలీసులు పెద్దఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పలు పల్లెల్లో కోళ్ల పందాలు చట్టవిరుద్ధమంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు.

పనిలో పనిగా కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పండుగ వచ్చేయటంతో పోలీసులు.. ప్రజల మధ్య కోడి పందాల విషయంలో అంతరం బాగా పెరిగిపోయింది. ఏడాదిలో ఒక్కరోజు కోడి పందాల విషయంలో మినహాయింపు ఇస్తే పోయేదేముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సంప్రదాయంగా.. శతాబ్దాల నుంచి వస్తున్న కోడిపందాల మీద ఆంక్షలు విధించటం సరికాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రజలే ప్రభుత్వమని.. అలాంటి ప్రజలు అత్యధికులు ఆశ పడుతున్న కోడిపందాల విషయంలో భిన్నంగా వ్యవహరించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదే సమయంలో మరికొందరు.. మరికొంత లోతుగా వెళుతూ.. కొన్ని వర్గాలకు మినహాయింపులు ఇస్తున్నారని.. తమకు మాత్రం ఇలా వ్యవహరించటం ఏమిటని వాదిస్తున్నారు. మొత్తానికి కోడిపందాల నిషేధం పుణ్యమా అని ఏపీలోని గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పండుగపూట సరదాగా వ్యవహరించాల్సింది పోయి.. టెన్షన్‌తో ఈ గోలేందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు