చలి నిజంగానే చంపేసింది

చలి నిజంగానే చంపేసింది

ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంగా ఉష్ణోగ్రతలు పడిపోవటం తెలిసిందే. తగ్గిన ఉష్ణోగ్రతలతో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంగా మారిపోయింది. ఎముకలు కొరికేసే చలి పుణ్యమా అని.. జలుబు.. దగ్గు.. జ్వరాలతోపాటు.. ప్రాణాలు తీసే స్వైన్‌ఫ్లూ విరుచుకుపడుతోంది.

పెరిగిన చలితో వయసులో ఉన్న వారు సైతం గజగజ వణికిపోతున్న పరిస్థితి. ఇళ్లల్లో తలుపులన్నీ బిగించుకున్నా చలి తీవ్రతను వణికిపోతున్న పరిస్థితి. సాయంత్రం ఐదు దాటితే మొదలయ్యే చలి.. పక్కరోజు ఉదయం పది గంటల వరకు కొనసాగుతోంది. దీంతో.. ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు.

చంపేసే చలి అన్న మాటకు తగ్గట్లే.. చలి తీవ్రతను భారీగానే ప్రాణాలు పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో చలి తీవ్రత కారణంగా ఒక్క తెలంగాణలో చనిపోయిన వారు 17 మందిగా గుర్తించారు. దీనికి తోడు.. స్వైన్‌ఫ్లూకారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీని బారిన పడుతున్న వారు రోజురోజుకీ పెరుగుతున్నారనే చెప్పాలి.

చంపేసీ ఈ చలి మరో రెండు రోజుల వరకూ ఉంటుందని చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత మారే పరిస్థితులతో.. చలి తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. వాతావరణ నిపుణులు ఇదే మాట చెబుతున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు