భూములివ్వమంటూ ముగ్గులేసి చెప్పారు

భూములివ్వమంటూ ముగ్గులేసి చెప్పారు

ఏపీలో రాజధాని కోసం భూసేకరణ కార్యక్రమం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా మూడురోజుల పాటు భూసేకరణకు విరామం ఇచ్చారు. మరోవైపు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రెండు గ్రామాల్లో మాత్రం భూములు ఇచ్చేందుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సాధారణంగా సంక్రాంతి పండుగ సందర్భంగా కళకళలాడే గ్రామాలకు భిన్నంగా.. ఈ రెండు గ్రామాల్లోనే నిరసనలు వ్యక్తమవుతోంది. సంక్రాంతి హడావుడి పెద్దగా కనిపించటం లేదనే చెప్పాలి.

ఏపీ రాజధాని కోసం చాలా గ్రామాల వారు తమ మద్ధతును ప్రకటిస్తూ.. భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాయి. అయితే.. పెనుమాక.. ఉండవల్లి గ్రామాల ప్రజలు మాత్రం తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఏడాదికి మూడు పంటు పండించే తమ భూములు ఇవ్వటం సాధ్యం కాదని చెప్పటమే కాదు.. సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేసి మరీ.. తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

భూములు ఇవ్వమని ముగ్గులతో రాస్తున్నారు. మరికొన్ని చోట్ల భూసేకరణకు తాము వ్యతిరేకమని.. తాము భూములు ఇవ్వమని తేల్చిచెబుతున్నారు. ఈ రెండు గ్రామాల మినహా మిగిలిన గ్రామాల్లో పరిస్థితి భిన్నంగా ఉందనే చెప్పాలి. తమ రెండు గ్రామాలను భూసేకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ గ్రామస్తులు కోరుతున్నారు. మరి.. ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు