సోనియమ్మ సలహాలిస్తే చాలంట

సోనియమ్మ సలహాలిస్తే చాలంట

పవర్‌ చేతిలో ఉన్నప్పుడు మనసులోని మాట పెదాల కిందనే ఆగిపోతుంది. అదే.. పవర్‌ చేజారినప్పుడు అందరూ సలహాలిచ్చేవారే. సూచనలు చేసేవారే. పదేళ్ల పాటు దేశంలోనే అత్యంత శక్తివంతురాలుగా వ్యవహరించి.. కొమ్ములు తిరిగిన నేతలు సైతం నోరు మెదపకుండా ఉన్న పరిస్థితి.

అలాంటి పరిస్థితి నుంచి.. బాహాటంగా.. మీరు సలహాలు ఇచ్చే సరిపోతుంది. అబ్బాయిగారికి పార్టీ పగ్గాలు ఇచ్చేయండంటూ సూచనలు చేయించుకుంటున్న దుస్థితి. కాంగ్రెస్‌ పార్టీ పగ్గాల్ని రాహుల్‌గాంధీ చేతికి అప్పగించేందుకు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివారు లోగుట్టుగా పావులు  కదుపుతున్నా.. సీనియర్‌నేత.. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడైన దిగ్విజయ్‌ సింగ్‌ మాత్రం యువరాజు రాహుల్‌కు పార్టీ పట్టాభిషేకం చేసేసి.. పార్టీ అధ్యక్ష పదవిని కిరీటంగా పెట్టేయాలని కోరుతున్నారు.

ఇప్పటికే పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా మరో చిన్న సూచనతో తన పాత డిమాండ్‌ను వినిపించారు. కాంగ్రెస్‌ పార్టీ పూర్తి బాధ్యతల్ని రాహుల్‌గాంధీ చేపట్టాలని.. అదే సమయంలో సోనియాగాంధీ మాత్రం పార్టీకి సలహాదారుగా వ్యవహరించాలని కోరారు. ఒక్క ఓటమి.. సోనియమ్మను సలహాలు తీసుకునే పరిస్థితుల్లోకి తీసుకెళ్లిపోయిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు