గమనించారా; సంక్రాంతి సంబరాల్లో బ్రహ్మణి కనిపించలేదే

గమనించారా; సంక్రాంతి సంబరాల్లో బ్రహ్మణి కనిపించలేదే

పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఈ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గత ఏడాది ఈ సమయానికి ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనే చెప్పాలి. రాష్ట్రవిభజన అంశం తేలకపోవటంతో పాటు.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఉత్కంట అప్పట్లో చాలాఎక్కువగా ఉండేది.

అందుకు భిన్నంగా ఇప్పుడు పరిస్థితి. అధికారంలోకి రావటమేకాదు.. ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించటం ఆయన్ను ఆనందానికి గురి చేసే అంశంగా చెప్పాలి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పండుగను ఘనంగా జరుపుకుంటున్న ఆయన.. తన కుటుంబ సభ్యులతో సహా.. చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు బాబుఫ్యామిలీకి ఘనంగా స్వాగతం పలికారనే చెప్పాలి. ఈ జనసందోహం ఎంత ఎక్కువగా ఉందంటే.. ఇంట్లో నుంచి బయటకు వచ్చిలోపలకు వెళ్లటానికి గంట సమయం తీసుకోవటం గమనార్హం.

పండక్కి చంద్రబాబు.. ఆయన సతీమణి.. కుమారుడు లోకేశ్‌.. వియ్యంకుడు బాలకృష్ణ సతీమణి వసుంధర.. కుమార్తె తేజస్విని ఇలా చాలామందే వచ్చారు. కానీ.. లోకేశ్‌ సతీమణి బ్రహ్మణి మాత్రం కనిపించలేదు.

ఆమె రాకపోవటాన్ని గుర్తించి.. పలువురు ఆమె గురించి మాట్లాడుకోవటం కనిపించింది. సన్నిహితుల సమాచారం ప్రకారం.. బ్రహ్మణి ప్రస్తుతం గర్భంతో ఉండటం.. ఆరోగ్య కారణాల దృష్ట్యా దూరం ప్రయాణించటం అంత సరికాదన్న సలహాతో సంక్రాంతి సంబరాలకు హాజరు కాలేదని చెబుతున్నారు. అందరూ.. హ్యాపీగా సంక్రాంతి పండగను ఎంజాయ్‌ చేస్తుంటే... బ్రాహ్మణి మాత్రం ఒక్కరే ఉండాల్సి రావటం కాస్తంత కష్టమైన విషయమే అని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు