మెట్లు దిగి.. పూల బకే పట్టుకొని మరీ నిరీక్షణ

మెట్లు దిగి.. పూల బకే పట్టుకొని మరీ నిరీక్షణ

మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు దేవుడితో సమానమని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతున్నారు. ఇక.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయితే.. ప్రాంతం ఏదైనా మాకు అనవసరం.. పెట్టుబడి పెట్టేవారికి  రెడ్‌కార్పెట్‌ పరిచి మరి స్వాగతం పలుకుతామంటూ చెబుతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటే ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయంపై కాస్త క్లారిటీ తక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి మాదిరి.. ఆయన మేనల్లుడు హరీశ్‌ మాదిరి.. గుండెల్లోకి దూసుకెళ్లేలా మాటలు చెప్పటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్‌ కోకు కాస్త తక్కువనే చెప్పాలి.

అయితే.. బాబు వ్యవహారశైలని నిశితంగా పరిశీలిస్తే.. ఆయన మాటల కంటే చేతల్లో తాను చేయాల్సిన పనిని కామ్‌గా చేసేసుకుంటూ పోతున్నారనే చెప్పాలి. తాజాగా సింగపూర్‌ నుంచి భారీ బృందం ఒకటి ఏపీ సెక్రటేరియట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు ఏపీ సీఎం చంద్రబాబు మెట్టు దిగి పోర్టికోలో పూల పట్టుకొని మరీ వెయిట్‌ చేసి స్వాగతం పలికి మరీ లోపలకు తీసుకెళ్లారు.

ఆ సమయంలో సదరు అతిధి వాహనాన్ని నేరుగా సీఎం అధికార వాహనం నిలిపే స్థలానికి తీసుకొచ్చి నిలిపారు. ఈ సందర్భంగా సీఎం కారును సైతం పక్కన పెట్టారు. ఇంటికి వచ్చిన అతిధికి ఇంత మర్యాద దక్కితే వారు మర్చిపోకుండా ఉంటారా? కేసీఆర్‌ అండ్‌కో మాటల్లో చెబుతున్న దాన్ని.. చంద్రబాబు చేతల్లో చేసి చూపించేస్తున్నారన్నమాట

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు