తలసానికి ఆ దమ్ము ఉందా?

తలసానికి ఆ దమ్ము ఉందా?

తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు మీద పోటీ చేసి గెలిచి.. ఈ మధ్యనే గోడ దూకి తెలంగాణ అధికార పార్టీలోకి చేరటమే కాదు.. మంత్రి పదవిని చేజిక్కించుకున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అదృష్టం ఎలాంటిదో అందరికి తెలిసిందే.

తాజాగా ముగిసిన కంటోన్మెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన నేతలు విజయం సాధించటంపై తలసాని స్పందిస్తూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలు పునరావృతం అవుతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్‌ ఎన్నికల్లో మాదిరి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయంతప్పదని తేల్చారు.

మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత మాగంటి గోపీనాథ్‌ రియాక్ట్‌ అయ్యారు. తలసానికి నిజంగా దమ్ముంటే.. సనత్‌నగర్‌ నుంచి మళ్లీ పోటీ చేసి గెలవాలంటూ సవాలు విసిరారు. మంత్రి పదవిని చేపట్టే సమయంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఆ లేఖను స్పీకర్‌కు పంపి తెలంగాణ అధికారపక్షంలోకి తలసాని చేరటం తెలిసిందే.

నిజంగా తలసానికి దమ్మే ఉంటే.. కేసీఆర్‌కు చెప్పి తన రాజీనామాను ఆమోదింపచేసి ఉప ఎన్నికకు సై అనేవారు కదా. అందుకేనేమో.. మిగిలిన విషయాలపై వెంటనే స్పందించే తలసాని.. మళ్లీ పోటీ చేసే విషయంపై మాత్రం అస్సలు స్పందించరు. ఎన్నో డక్కామెక్కీలు తిన్న తలసానికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు