సరిగా పెంచనందుకే చెడిపోయాడంట

సరిగా పెంచనందుకే చెడిపోయాడంట

మొండిగా.. మూర్ఖంగా మాట్లాడటం. తప్పు చేసి మరీ వాదించటం లాంటి లక్షణాలు కొందరికి ఉంటాయి. అచ్చు అలాంటి అక్షణాలే కనిపిస్తున్నాయి ప్రముఖ హాలీవుడ్‌ యాక్టర్‌ జాకీచాన్‌ కుమారుడు జెసీచాన్‌ను చూస్తుంటే.

చైనాలో నిషేధిత డ్రగ్స్‌ను వినియోగిస్తూ దొరికిపోయిన అతగాడికి..  ఆర్నెల్లు జైలుశిక్ష విధించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతగాడు తన తల్లికి ఒక లేఖ రాశాడు. దాన్ని మీడియాకు విడుదల చేశాడు.

తన తండ్రి సినిమాల్లో యాక్ట్‌ చేస్తూ బిజీగా ఉండి.. తనను పెంచే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అస్సలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే తాను చెడు మార్గాల వైపు అడుగులేశానని చెప్పుకొచ్చాడు. ఒక రకంగా తాను జైలుకెళ్లటానికి కారణం తన తండ్రే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డ్రగ్స్‌కేసులో నిందితుడైన తన కొడుకు తనకున్న పేరు ప్రఖ్యాతులతో రక్షించుకోనని.. తన కొడుకు చేసిన పనికి దేశ ప్రజలకు జాకీచాన్‌ క్షమాపణలు చెప్పారు.

చిన్నతనంలో ఒక ప్రముఖ నటుడి ఇంట్లో పుట్టినందుకు వల్ల చాలా రిచ్‌గా బతికానని చెప్పుకున్న జాకీచాన్‌కొడుకు..తన తండ్రి తనను ఎప్పుడూ పట్టించుకోలేదని వాపోయాడు. తండ్రుల కష్టం కొడుకులకు మరింత సౌఖ్యాన్ని అందించేందుకే. ఆ చిన్న విషయాన్ని పట్టించుకోలేకపోవటమే కాదు.. ఇంత జరిగిన తర్వాత కూడా తప్పును తన తండ్రి మీద నెట్టే మైండ్‌సెట్‌ చూస్తుంటేనే.. జాకచాన్‌ కొడుకు ఏ టైపో కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు